రేపు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో బీసీ మంత్రుల సమావేశం.. 9 మందికి పిలుపు

Siva Kodati |  
Published : Nov 25, 2022, 03:09 PM IST
రేపు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో బీసీ మంత్రుల సమావేశం.. 9 మందికి పిలుపు

సారాంశం

శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బీసీ మంత్రులు, నేతల సమావేశం జరగనుంది. ఈ భేటీకి 9 మందికి ఆహ్వానాలు అందినట్లుగా తెలుస్తోంది. ఆయా వర్గాలకు ఇచ్చిన పథకాలను వివరించడం వంటిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో రేపు బీసీ మంత్రులు, నేతల కీలక సమావేశం జరగనుంది. శనివారం ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ భేటీకి మంత్రులు బొత్స సత్యనారాయణ, గుమ్మనూరి జయరాం, జోగి రమేశ్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ముత్యాల నాయుడులతో పాటు ఎంపీ మోపిదేవి వెంకట రమణ, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, పార్థసారథి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఈ భేటీకి హాజరుకానున్నారు. 

వచ్చే ఎన్నికల్లో బీసీలను కన్సాలిడేట్ చేసుకోవడం, ఆయా వర్గాలకు ఇచ్చిన పథకాలను వివరించడం వంటిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రాష్ట్ర స్థాయి సదస్సులు నిర్వహించడం వంటి అంశాలపైనా 9 మంది నేతలు చర్చించే అవకాశం వుంది. భేటీ తర్వాత వీరంతా ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యే అవకాశం వుందని సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu
Annadata Sukhibhava: రైతుల‌కు ద‌స‌రా కానుక‌.. ఖాతాల్లోకి రూ. 6000 జ‌మ‌, ఎప్పుడంటే.?