నేను సర్వీసులో ఉంటే నీలాంటోడికి పాఠాలు చెప్పేటోడ్ని: అచ్చెన్నకు వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్

By Nagaraju penumala  |  First Published Dec 13, 2019, 4:31 PM IST

10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తాను స్టేట్ ఫోర్త్ ర్యాంకర్ ని అని చెప్పుకొచ్చారు వైసీపీ ఎమ్మెల్యే అప్పలరాజు. తనకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గోల్డ్ మెడల్ కూడా అందజేశారని గుర్తు చేశారు. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో మాజీమంత్రి అచ్చెన్నాయుడును టార్గెట్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. అచ్చెన్నాయుడును పశువుల ఆస్పత్రిలో చేర్పించాలని ఒక మంత్రి సూచిస్తే, అచ్చెన్న మహిళలను వేధించినట్లు కేసు కూడా నమోదైందంటూ మరో మంత్రి ఆరోపించారు. 

ఇంతలో అచ్చెన్నాయుడు సొంత జిల్లాకు చెందిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అయితే దిశ చట్టం అమలు చేస్తే ముందు అచ్చెన్నాయుడు కేసు నుంచే స్టార్ట్ చేయాలంటూ సూచించారు. కళ్యాణి అనే మహిళను తన్నినట్లు ఆరోపణలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. 

Latest Videos

దాంతో అచ్చెన్నాయుడు పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఎమ్మెల్యే అయ్యారని వెనుక ముందూ చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కొద్ది రోజుల్లో నీసంగతి తెలుస్తుందంటూ ఎమ్మెల్యే అప్పలరాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. 

చంద్రబాబు గిల్లుడుకు ఆ ఎమ్మెల్యే ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది: వైసీపీ ఎమ్మెల్యే రాజా...

దానికి ఎమ్మెల్యే అప్పలరాజు ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. తనకు వెనక ముందు ఎవరూ లేరని ఉన్నది ఒక్కరే అదే వైయస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. జగన్ ఉన్నంత వరకు తనకు ఎలాటి భయం లేదన్నారు. 

ఇకపోతే తనకు ఏమీ తెలియదన్న అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు సరికాదన్నారు. తనకు ఏమీ తెలియకపోతే ప్రజలు అసెంబ్లీకి ఎందుకు పంపిస్తారో అది తెలుసుకోవాలంటూ సూచించారు. తనను విమర్శించే ముందు తన ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్స్ గురించి తెలుసుకుంటే మంచిదన్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తాను స్టేట్ ఫోర్త్ ర్యాంకర్ ని అని చెప్పుకొచ్చారు వైసీపీ ఎమ్మెల్యే అప్పలరాజు. తనకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గోల్డ్ మెడల్ కూడా అందజేశారని గుర్తు చేశారు. 

కొడాలి నానికి మెంటల్, నీ సంగతి తొందర్లో తేలుతోంది: అచ్చెన్న...

ఇకపోతే తాను ఎంబీబీఎస్ పూర్తి చేశానని అనంతరం ఎండీ కూడా చేసినట్లు చెప్పుకొచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ కూడా చేశానని చెప్పుకొచ్చారు. తాను ప్రజాసేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చినట్లు గుర్తు చేశారు. తాను సర్వీసులో ఉంటే ఒక ప్రొఫెసర్ అయ్యేవాడినని అంటే అచ్చెన్నాయుడులాంటి వాళ్లకు పాఠాలు చెప్పేటోడ్ని అంటూ చెప్పుకొచ్చారు. 

తనకు లేనిది అంటూ ఏమైనా ఉంది అంటే అచ్చెన్నాయుడులా ఆస్తులు లేవన్నారు. అచ్చెన్నాయుడు అంత బాడీ కూడా లేదని అయితే బుర్రమాత్రం సేమ్ టూ సేమ్ అంటూ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు మాజీమంత్రి అచ్చెన్నాయుడుకు కౌంటర్ ఇచ్చారు. 

అసెంబ్లీలో ప్రతీ ఒక్కరూ తనను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపడం తాను చేసిన తప్పా అంటూ నిలదీశారు. ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై మాట్లాడితే దాడికి దిగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి అచ్చెన్నాయుడు. 

నిన్ను పశువుల ఆస్పత్రిలో మీ బాస్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి: టీడీపీపై కొడాలి నాని..

click me!