ఆ అధికారం జగన్‌కు లేదు: కృష్ణకిశోర్‌ వ్యవహారంపై బాబు కామెంట్

By sivanagaprasad Kodati  |  First Published Dec 13, 2019, 4:26 PM IST

ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌ సస్పెన్షన్‌పై ఘాటుగా స్పందించిన బాబు.. డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారిని సస్పెండ్ చేసే అధికారం జగన్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు.


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌ సస్పెన్షన్‌పై ఘాటుగా స్పందించిన బాబు.. డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారిని సస్పెండ్ చేసే అధికారం జగన్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు.

జగన్‌తో పాటు జైలులో ఉన్న వారందరికి ఉన్నత పదవులు ఇచ్చారని బాబు మండిపడ్డారు. తాను ప్రభుత్వోద్యోగిని బాస్టర్డ్ అన్నట్లుగా వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తానెక్కడా ఆ పదాన్ని ఉపయోగించలేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

Latest Videos

undefined

Also read:సత్వర న్యాయం: ఏపీ దిశ చట్టంలోని ముఖ్యాంశాలు ఇవే.

చెప్పుతో కొట్టాలి.. నడిరోడ్డుపై ఉరేయ్యాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డిని ఉన్మాది అంటే పౌరుషం పొడిచుకొచ్చిందని టీడీపీ అధినేత ఎద్దేవా చేశారు. తాను అనని మాటను పట్టుకుని జగన్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఆయన సీఎం పదవికి అనర్హుడని చంద్రబాబు మండిపడ్డారు.

జగన్ ఎంపీగా ఉండి సాక్ష్యాలను తారుమారు చేశారని.. ముఖ్యమంత్రిగా ఉంటే మరింతగా ప్రభావితం చేస్తారని శుక్రవారం కోర్టుకు రాకుండా మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ పదే పదే కోర్టు దృష్టికి తీసుకొచ్చిందన్నారు.తన అక్రమాస్తుల కేసులో భాగస్వామ్యులైన అధికారులపై  జగన్ కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Also Read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్: అసెంబ్లీలో జగన్ సంచలన వ్యాఖ్యలు

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా వేదిక కూల్చడం, ఇంట్లోకి వరదనీరు వచ్చేలా చేయడం, భద్రతను తగ్గించడం వంటి చర్యలతో తనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని బాబు మండిపడ్డారు. అసెంబ్లీలో ఇంత జరిగినా స్పీకర్‌ పట్టించుకోవడం లేదని.. ఇరు వర్గాలను పిలిచి మాట్లాడలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 
 

click me!