పవన్ కు ఝలక్: జగన్ ను సమర్థించిన జనసేన ఎమ్మెల్యే రాపాక

By Nagaraju penumala  |  First Published Dec 11, 2019, 11:46 AM IST

కళ్యాణ్ వ్యాఖ్యలకు ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కౌంటర్ ఇచ్చినట్లు కామెంట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు.  ఇంగ్లీషు బోధనపై ప్రభుత్వ నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నట్లు తెలిపారు.


అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న రాద్ధాంతం అంతా ఇంతాకాదు. ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడటమే కాదు ఏకంగా శాపనార్థాలు సైతం పెట్టారు పవన్ కళ్యాణ్. తెలుగు భాష ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. 

Latest Videos

undefined

అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కౌంటర్ ఇచ్చినట్లు కామెంట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. 

మేం ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదు, కానీ...: పవన్ కల్యాణ్...

ఇంగ్లీషు బోధనపై ప్రభుత్వ నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నట్లు తెలిపారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని తాన స్వాగతించడంతోపాటు సీఎం జగన్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు.   

pawan kalyan:తల్లిని చంపొద్దు: జగన్ పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే వారిలో దళితులే అత్యధికంగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పుకొచ్చారు రాపాక వరప్రసాద్. సంపన్నవర్గాల బిడ్డలు ప్రైవేట్ స్కూల్లో చదువుతారని తమ పిల్లలు మాత్రం ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతూ ఇంగ్లీషు మీడియంకు నోచుకోవడం లేదని చెప్పుకొచ్చారు. 

ఇలాంటి తరుణంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం మంచి నిర్ణయమని ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. తాను జగన్ నిర్ణయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు తెలిపారు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. 

బాబు! మిమ్మల్ని చూసి మేం ఏం నేర్చుకోవాలి: వైసీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం.

గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టేందుకు ఒక ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. అయితే అది సక్సెస్ కాలేదని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు ప్రయత్నించి విఫలమైన నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంపై తెలుగుదేశం పార్టీ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించడంలో అర్థం లేదని చెప్పుకొచ్చారు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. 

ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తూ  జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సభలో ప్రసంగిస్తున్నంత సేపు సీఎం జగన్ ఆసక్తిగా విన్నారు. జగన్ ను ప్రశంసిస్తున్నప్పుడు ఆయన ముసిముసి నవ్వులు నవ్వారు. 

చంద్రబాబు అత్తకు కేబినెట్ హోదా ఇచ్చాం: సభలో జగన్ పంచ్..

click me!