వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విప్లవంలో టీడీపీ సహా ఆ పార్టీతో పొత్తున్న పార్టీలు కూడా కొట్టుకుపోతాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.
విశాఖపట్టణం: వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల విప్లవంలో టీడీపీ సహా ఆ పార్టీతో పొత్తున్న పార్టీలు కొట్టుకుపోతాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.
సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర రెండో రోజు ప్రారంభమైంది,. శుక్రవారం నాడు విశాఖపట్టణం జిల్లాలోని గాజువాక సెంటర్ లో నిర్వహించిన సభలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ Tammineni Sitaram ఈ బస్సు యాత్ర సందర్భంగా ప్రసంగించారు.
undefined
also read:మంత్రుల సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర ప్రారంభం.. సాయంత్రం విజయనగరంలో బహిరంగ సభ
దళిత కులంలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని Chandrababu Naidu గతంలో వ్యాఖ్యానించారని తమ్మనేని సీతారాం చెప్పారు. నాయిబ్రహ్మణులు తమ సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో వెళ్తే మీ తోకలు కత్తిరిస్తానని వ్యాఖ్యానించారని తమ్మినేని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరో వైపు బీసీలు జడ్జిలుగా పనికి రారని చంద్రబాబు లేఖ రాశాడని తమ్మినేని విమర్శలు చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు తలెత్తుకునేలా YS Jagan సామాజిక న్యాయం చేశారని AP Assembly Speaker చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఆర్ధికంగా ఎదిగేందుకు జగన్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని స్పీకర్ గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా లబ్దిదారులకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.
Konaseemaకు అంబేద్కర్ పేరు పెడితే తప్పా అని తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఎందుకు అల్లర్లు సృష్టిస్తున్నాయని కూడా ఆయన ప్రశ్నించారు.ఈ అల్లర్లకు ప్రభుత్వే బాధ్యత వహించాలంటున్నారు. మీకు బాధ్యత లేదా అని విపక్షాలను ప్రశ్నించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. రాష్ట్రంలో సంతృప్తికర పాలన సాగుతుందన్నారు. చంద్రబాు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో చివరి 7 నెలల వరకు కూడా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కూడా ఆయన కేబినెట్ లో లేడని సీతారాం విమర్శలు చేశారు. వస్తున్నాయి వస్తున్నాయి.. జగన్నాథుడి రథచక్రాలు అంటూ శ్రీశ్రీ కవితను ఆయన చదివి విన్పించాడు. జగన్ మోహన్ రెడ్డి రథ చక్రాల కింద టీడీపీ నలిగిపోతోందన్నారు.
ఒంగోలులో నిర్వహించేది TDP మహానాడు కాదు, అది వల్ల కాడు అంటూ తమ్మినేని సీతారాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మేనిఫెస్టోను తుంగలో తొక్కింది చంద్రబాబు అని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఏనాడైనా కూడా సామాజిక న్యాయం పాటించారా అని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు.మన ఆత్మగౌరవాన్ని పెంపొందించుకొనేందుకు వైసీపీకి ఓటు వేయాలని ఆయన కోరారు.
ఏపీ మంత్రుల యాత్ర శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. ఈ యాత్ర ఈ నెల 26వ తేదీన శ్రీకాకుళంలోప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జరిగిన సామాజిక న్యాయాన్ని బస్సుయాత్ర ద్వారా ప్రజలకు వివరించనున్నారు.
ఈ నెల 27న రాజమహేంద్రవరంలో, 28న నరసరావుపేటలో, 29న అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహిస్తారు. యాత్రలో భాగంగా ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవులు పొందిన వారు పాల్గొని సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించనున్నారు.