యువతి పంపిన వీడియో లింక్ తో సంభాషణ: చేబ్రోలు వాసి ఖాతా నుండి రూ. 2.50 లక్షలు మాయం

By narsimha lode  |  First Published May 27, 2022, 10:10 AM IST

సోషల్ మీడియాలో పరిచయమైన యువతి వీడియో లింక్ క్లిక్ చేసిన యువకుడి ఖాతా నుండి రూ. 2.50 లక్షలు మాయామయ్యాయి. ఈ విషయమై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో చోటు చేసుకుంది.


బాపట్ల: Social media మీడియాలో పరిచయమైన యువతి పంపిన Video link  క్లిక్ చేసిన యువకుడి బ్యాంకు ఖాతా నుండి రూ. 2.50 లక్షలు మాయమయ్యాయి.ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని Bapatla జిల్లా  chiralaమండలం చేబ్రోలు మండలం హస్తినాపురం సమీపంలోని జాండ్రపేటకు చెందిన దేవాన గణేష్ ఉపాధి కోసం  vunguturu మండలం chebroluకు వచ్చాడు. ఇక్కడే ఉన్న ఓ ఫ్యాక్టరీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. గణేస్ కు ఫేస్ బుక్ లో ఓ యువతి పరిచయమైంది. దీంతో వీరిద్దరూ తరచుగా ఫోన్ లో మాట్లాడుకునేవారు. ఫోన్ లో వీడియో కాల్ మాట్లాడుకుందామని యువతి గణేష్ కి వీడియో కాల్ లింక్ ను పంపింది. ఈ లింక్ ను Ganeshడౌన్ లోడ్ చేసుకున్నాడు.  ఈ లింక్ తో యువతితో మాట్లాడాడు.  

Latest Videos

అయితే  ఈ నెల 23న రాత్రి తన ఫోన్ లో  నెట్ బ్యాలెన్స్ లేదని  రూ. 20 తన ఖాతాలో జమ చేయాలని యువతి కోరింది. వెంటనే ఆమె చెప్పిన బ్యాంకు ఖాతాకు రూ. 20  జమ చేశాడు. వెంటనే గణేష్ బ్యాంకు ఖాతాలోని రూ. 2.50 లక్షలు డెబిట్ అయ్యాయి.  దీంతో బ్యాంకుకు వెళ్లి గణేష్ పిర్యాదు చేశాడు.  

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ బ్యాంకుకు ఈ నగదు బదిలీ అయినట్టుగా బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ విషయమై పోలీసులకు పిర్యాదు చేస్తే తన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని కూడా ఆ యువతి బెదిరింపులకు దిగిందని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫ్రెండ్స్ రిక్వెస్ట్ లను అంగీకరించవద్దని కూడా పోలీసులు ప,దే పదే ప్రజలను హెచ్చరిస్తున్నారు. అయినా  పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా వ్యవహరించడం వల్లే ఈ తరహా ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. గతంలో కూడా ఇదే తరహా ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగాయి

click me!