శ్రీకాళహస్తిలోని ఫిన్ కేర్ ప్రైవేట్ బ్యాంకులో గురువారం నాడు రాత్రి దోపీడీ చోటు చేసుకొంది. రూ 85 లక్షల బంగారు ఆభరణాలు, రూ. 5 లక్షల నగదును దోచుకున్నారు.
శ్రీకాళహస్తి: srikalahasti లోని ఫిన్ కేర్ ప్రైవేట్ బ్యాంకులో గురువారం నాడు అర్ధరాత్రి దోపీడీ చోటు చేసుకుంది. రూ. 85 లక్షల బంగారు ఆభరణాలను రూ. 5 లక్షల నగదును దోచుకున్నారు.
గురువారం నాడు రాత్రి Fincare బ్యాంకులో ఆడిట్ జరుగుతున్న సమయంలో దొంగలు బ్యాంకులోకి చొరబడ్డారు. బ్యాంకులో ఉన్న సిబ్బందిని బెదిరించారు. బ్యాంకు లాకర్ తాళాలు తీసుకొన్నారు. Locker లోని బంగారు ఆభరణాలు, రూ. 5 లక్షల నగదును దోచుకున్నారు. ఈ విషయమై బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ విషయమై కేస నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
undefined
తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో కూడా ఇదే తరహాలో బ్యాంకుల్లో చోరీలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 30 వ తేదీన అనకాపల్లిలో గ్రామీణ బ్యాంకులో దోపీడీ జరిగింది. కసింకోట మండలం నర్సింగపల్లిలోని ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో చొరబడిన ఓ గుర్తు తెలియని దుండగుడు తుపాకీతో క్యాషియర్‌ను బెదిరించాడు. అనంతరం అతని వద్ద ఉన్న రూ.3.30 లక్షలు లాక్కొని పారిపోయాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనతో బ్యాంకు సిబ్బందితో పాటు ఖాతాదారులు షాక్‌కు గురయ్యారు. అనంతరం తేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రగంలోకి దించారు. దోపిడీకి పాల్పడిన వ్యక్తి కస్టమర్‌లా బ్యాంక్‌లోకి ప్రవేశించారు. తన ముఖం ఏ మాత్రం కనిపించకుండా హెల్మెట్ పెట్టుకున్నారు. బ్యాగ్ తగిలించుకుని ఉన్నాడు. దోపిడీ సమయంలో నిందితుడు బ్యాంక్ సిబ్బందిని బెదిరించిన విజువల్స్, పారిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
గుంటూరు జిల్లాలో భారీ చోరీ జరిగింది. 2020 నవంబర్ 20న ఈ ఘటన చోటు చేసుకుంది. . దాచేపల్లి మున్సిపాలిటీ పరిదిలోని నడికుడి భారతీయ స్టేట్ బ్యాంకులో చోరీ చేసిన దొంగలు సుమారు 90 లక్షలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీస్ అధికారులు బ్యాంక్ పరిసర ప్రాంతాల్ని పరిశీలించారు. దీనిమీద దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
2019 ఆగష్టు 20న అనంతపురం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో స్ట్రాంగ్ రూమ్‌ను పగులగొట్టేందుకు దొంగలు ప్రయత్నించారు. రెండు లాకర్లను పగుల గొట్టారు. మరునాడు బ్యాంకుకు వచ్చిన సిబ్బంది స్ట్రాంగ్ రూమ్ ను ధ్వంసం చేసిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.