ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతాారాం టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. టీడీపీ సభ్యుల నిరసనను తట్టుకోలేక సభ నుండి బయటకు వెళ్లారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీలో మంగళవారం నాడు స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తన హెడ్‌సెట్‌ను వదలి సభ నుండి స్పీకర్ తమ్మినేని సీతారాం వెళ్లిపోయారు.
also read:మండలిలో బిల్లు: 71 కింద చర్చకు పట్టు, టీడీపీ సభ్యుల గైర్జాజర్
undefined
మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం ఎస్సీ కమిషన్ బిల్లును ప్రవేశపెట్టింది.ఈ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో టీడీపీ సభ్యులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఎస్సీ కమిషన్ బిల్లుపై వైసీపీకి చెందిన సభ్యులు మాట్లాడారు. ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చ విషయంలో మాట్లాడుతూ టీడీపీ సభ్యులు తీరును తప్పుబట్టారు.
Also read:ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ బిల్లు: కౌంటర్ వ్యూహాంతో టీడీపీ
ఎస్సీ కమిషన్ బిల్లు విషయంలో టీడీపీ తీరును వైసీపీకి చెందిన సభ్యులు మాట్లాడారు. టీడీపీ తీరుపై మాట్లాడారు. టీడీపీ తీరును తప్పుబట్టారు.. జై అమరావతి అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం ముందు నిలబడ్డారు.
టీడీపీ సభ్యులను స్పీకర్ వారించినా కూడ టీడీపీ సభ్యులు మాత్రం వినలేదు. వైసీపీకి చెందిన పలువురు దళిత ఎమ్మెల్యేలు ఎస్సీ కమిషన్ బిల్లుకు మద్దతుగా మాట్లాడారు. ఆ సమయంలో కూడ టీడీపీ సభ్యులు అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
వైసీపీకి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ సభ్యుల తీరును స్పీకర్ తమ్మినేని సీతారాం తీరు తప్పుబట్టారు. అంతేకాదు తన హెడ్‌సెట్‌ను తీసేశారు.టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై తాను నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా తమ్మినేని సీతారాం ప్రకటించారు. టీడీపీ సభ్యుల తీరును తమ్మినేని సీతారాం తప్పుబట్టారు. ఈ విషయమై తాను నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
టీడీపీ సభ్యుల తీరును నిరసిస్తూ తమ్మినేని సీతారాం తన సీటు నుండి విసురుగా వెళ్లిపోయాడు. ఆ సమయంలో వైసీపీ సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడతున్నాడు. అయితే స్పీకర్ విసురుగా వెళ్లిపోవడంతో వైసీపీ సభ్యుడు భాస్కర్ రెడ్డి నిశ్చేషుడై నిలబడిపోయాడు. సభ నుండి స్పీకర్ తమ్మినేని సీతారాం వెళ్లిపోవడంతో సభ అర్ధాంతరంగా నిలిచిపోయింది.