ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హరీష్ రావు... హాట్ హాట్ గా చర్చ

By telugu teamFirst Published Jan 21, 2020, 11:22 AM IST
Highlights

తాజాగా ఈ రాజధాని చర్చతోపాటుగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హరీష్ రావు చర్చ కూడా మొదలయింది. ఏమిటి తెలంగాణ మంత్రేనా అనే అనుమానం కలగొచ్చు. అవును ఆయనే. ఆయనే ఇప్పుడు అక్కడ ఇంత కాక పుట్టిస్తున్న రాజధాని వివాదం కొనసాగుతున్నప్పడికి ఆయన చుట్టూ చర్చ నడుస్తుంది. 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఏదన్నా హాట్ టాపిక్ ఉందంటే అది రాజధాని అంశమే. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న క్రమంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అంశంపైన్నే తమ దృష్టినంతటిని కేంద్రీకరించాయి. 

ఒక పక్క అమరావతి ప్రాంత ప్రజలంతా రాజధానిని తరలించొద్దంటూ ఉద్యమిస్తుంటే... మరొపక్కనేమో ఉత్తరాంధ్రవాసులేమో ఈ జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. నేడు రెండో రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మరో వాడి వేడి చర్చ జరగడం మాత్రం తథ్యం గా కనపడుతుంది. 

Also read; రాజధాని ఎక్కడికీ పోదు... సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్

ఇక తాజాగా ఈ రాజధాని చర్చతోపాటుగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హరీష్ రావు చర్చ కూడా మొదలయింది. ఏమిటి తెలంగాణ మంత్రేనా అనే అనుమానం కలగొచ్చు. అవును ఆయనే. ఆయనే ఇప్పుడు అక్కడ ఇంత కాక పుట్టిస్తున్న రాజధాని వివాదం కొనసాగుతున్నప్పడికి ఆయన చుట్టూ చర్చ నడుస్తుంది. 

వివరాల్లోకి వెళితే.... తాజాగా హరీష్ కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుత పరిస్థితి బాగాలేదని ఆయన కామెంట్ చేసారు. రాజధాని చుట్టూ వివాదం చెలరేగడంతో, నూతన విధివిధానాలపైనా అనిష్చితి నెలకొనడంతో ఆంధ్రప్రదేశ్ లో కి నూతన పెట్టుబడులు వచ్చే సూచనలు కనబడడంలేదని ఆయన అన్నారు. 

అదే కాకుండా.... రాష్ట్రంలో ఇలా నూతన పెట్టుబడులు పెట్టే ఆస్కారం లేనందున రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కుదేలవుతుందని అన్నారు. ఈ పరిస్థితుల వల్ల తెలంగాణాలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుందని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఆయన అన్నారు. 

Also read; ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ బిల్లు: కౌంటర్ వ్యూహాంతో టీడీపీ

ఇలా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితుల వల్ల తెలంగాణాలో ముఖ్యంగా హైద్రాబాబ్డ్ నగరానికి మరింత లాభం చేకూరుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ లో గనుక రియల్ ఎస్టేట్ రంగం దీన్ని ఆసరాగా చేసుకొని అభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. 

హరీష్ మాదిరిగానే కొన్నిరోజుల కింద రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి మాటనే అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కుదేలయ్యిందని దీనివల్ల తెలంగాణాలో, ముఖ్యంగా హైదరాబాద్ లో నూతన పెట్టుబడులకు అనువుగా ఉందని, అందువల్ల హైద్రాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటుందని అన్నాడు. 

మొత్తానికి ఈ వ్యాఖ్యలను గనుక లోతుగా పరిశీలిస్తే ఇందులో వాస్తవం లేకపోలేదు కూడా. ఒక ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని ఇలా అర్థాంతరంగా రద్దు చేస్తే... మరోసారి వచ్చే ప్రభుత్వం ఇలా చేయదని గ్యారంటీ ఏమిటి?

click me!