నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా, మరి మీరు: చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్

By Nagaraju penumala  |  First Published Dec 17, 2019, 12:26 PM IST

జగన్ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను డైవర్ట్ చేసిందని మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్రానికి లేఖలు రాశారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. 


అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల విడుదలకు సంబంధించి తాను ముడుపులు తీసుకున్నట్లు చంద్రబాబు ఆరోపించడంపై మండిపడ్డారు. 

తాను ముడుపులు తీసుకున్నట్లు నిరూపిస్తే మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తారా అంటూ నిలదీశారు. 

Latest Videos

జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు ఎక్కడికీ పోలేదని పక్కదోవ పట్టించాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. కేంద్రం నుంచి రూ.1845 కోట్ల రూపాయల ఉపాధి నిధులు వచ్చాయనడం వాస్తవమేనని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. 

ఉపాధి హామీ పనుల్లో భాగంగా వేల కిలోమీటర్లు రోడ్లు వేశామని చెప్పుకొచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూలి వేతనాలను కూడా చెల్లించినట్లు చెప్పుకొచ్చారు. ఉపాధి హామీకి బిల్లులు చెల్లించాలని కేంద్రాని మూడు సార్లు అడిగినా ఇవ్వలేదన్నారు.  

ఆ నాయుడు మీ బంధువు కాదా, బయటపెడతాం: చంద్రబాబుపై జగన్...

నీరు-చెట్లు నిధులను టీడీపీ దుర్వినియోగం చేసిందని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నీరు చెట్టు పథకం పేరుతో రూ.4వేల కోట్లు తప్పుదారి పట్టించారంటూ మంత్రి ఆరోపించారు. 

ఇకపోతే జగన్ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను డైవర్ట్ చేసిందని మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్రానికి లేఖలు రాశారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. 

దిశ చట్టం నాతోనే ప్రారంభించండి, తట్టుకోలేను: సభలో మహిళా ఎమ్మెల్యే ఆవేదన..

టీడీపీ ఎంపీలు సైతం నిధులు తప్పుదోవ పట్టించారంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారంటూ అందుకు తగ్గ ఆధారాలను సభలో చూపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేయడం వెనుక ఉద్దేశం ఏంటని నిలదీశారు. రాష్ట్రానికి నిధులు రాకూడదని టీడీపీ ఉద్దేశమా అంటూ ప్రశ్నించారు. 

ఇకపోతే రాష్ట్రంలో 2,114 ఫిల్టర్‌ బెడ్లు ఉన్నాయని వాటిలో 1350 ఫిల్టర్‌ బెడ్లు పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గోదావరిలో కాలుష్యం వల్ల నీరు వడపోత కావడం లేదని స్పష్టం చేశారు. రూ.52.34 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. 

ఇంకా  ఆ నిధులు మంజూరు కావాల్సి ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం ప్రాంతంతో సహా పలు ప్రాంతాల్లో సురక్షిత మంచినీటి సరఫరా కోసం రూ.46వేల కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ప్రతిపాదన చేస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.  

ఆ ఎమ్మెల్యేలేమైనా పనికిమాలినోళ్లా..? పీకపోయినా సరే..: స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు...

click me!