మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ నివేదికను ఈ నెల 23వ తేదీ లోపుగా ఇవ్వాలని ఏపీ హైకోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పురోగతిని ఈ నెల 23వ తేదీ లోపుగా సీల్డ్ కవర్లో ఇవ్వాలని ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానిక మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను వచ్చే ఏడాది జనవరి మూడో తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు కీలకమైన ఆదేశాలను జారీ చేసింది.
Alsor read:వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్: హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్సీ పిటిషన్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఈ ఏడాది మార్చి 14వ తేదీన తన నివాసంలోనే దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం విచారణ చేస్తోంది.
అయితే ఈ విచారణను సీబీఐకు అప్పగించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవి ఈ నెల 11వ తేదీన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.వచ్చే నెల 3వ తేదీన జరిగే విచారణకు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తరపున మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఈ కేసును విచారించనున్నారని సమాచారం
ఈ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణను చేసింది.ఈ విచారణ సమయంలో హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటివరకు వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు వివరాలను తెలుపుతూ సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 23వ తేదీ లోపుగా ఈ నివేదికను అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మరో వైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడుగా ఉన్న పరమేశ్వర్ రెడ్డి గురించి కూడ సిట్ ఆరా తీసింది. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున పరమేశ్వర్ రెడ్డి ఏ ఆసుపత్రిలో ఉన్నాడో ఆ ఆసుపత్రిలో సిట్ అధికారులు విచారణ చేశారు.
పరమేశ్వర్ రెడ్డి ఏ సమయంలో ఆసుపత్రికి వచ్చాడు, ఏ రకమైన చికిత్సను ఆసుపత్రిలో తీసుకొన్నారు. ఎప్పుడు ఆసుపత్రి నుండి దిశ్చార్చీ అయ్యారనే విషయమై సిట్ బృందం విచారణ చేయనుంది.