కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

By Nagaraju penumala  |  First Published Aug 22, 2019, 1:55 PM IST

ఆనాటి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపులో అసెంబ్లీ చీఫ్ మార్షల్ గణేష్ బాబు పాత్ర ఉందంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగా చీఫ్ మార్షల్ గణేష్ బాబుపై తొలివేటు వేసింది. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన సామాగ్రిని స్పీకర్ కోడెల తన ఇంటికి తరలించిన అంశంపై రాష్ట్రప్రభుత్వం చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. కోడెల ఇంటికి అసెంబ్లీ సామాగ్రి తరలింపు వివాదంలో అసెంబ్లీ చీఫ్ మార్షల్ పై వేటువేసింది ఏపీ సర్కార్. 

ఆనాటి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపులో అసెంబ్లీ చీఫ్ మార్షల్ గణేష్ బాబు పాత్ర ఉందంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగా చీఫ్ మార్షల్ గణేష్ బాబుపై తొలివేటు వేసింది. 

Latest Videos

చీఫ్ మార్షల్ గణేష్ బాబుపై బదిలీవేటు వేసింది. గణేష్ బాబును అక్టోపస్ కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ సామాగ్రిని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇంటికి తరలింపు విషయానికి సంబంధించి ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్తోంది. 

ఇకపోతే అసెంబ్లీ సామాగ్రిని తానే వాడుకున్నానని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంగీకరించారు. అసెంబ్లీలో భద్రత ఉండదన్న ఉద్దేశంతోనే తన ఇంటికి తరలించినట్లు చెప్పుకొచ్చారు. తీసుకెళ్తే ఫర్నీచర్ అయినా తీసుకెళ్లండి లేకపోతే డబ్బులు అయినా తీసుకెళ్లండి అంటూ చెప్పుకొచ్చారు. 

ఫర్నిచర్ తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడే అసెంబ్లీ అధికారులకు తాను లేఖ కూడా రాసినట్లు చెప్పుకొచ్చారు.  కానీ శాసనసభ కార్యాలయ అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. ఇప్పుడైనా అధికారులు వస్తే ఫర్నిచర్ అప్పగిస్తానని... లేకపోతే ఎంత ఖర్చు అయ్యిందో చెబితే చెల్లిస్తానని శివప్రసాద్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

ఈ వార్తలు కూడా చదవండి

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

click me!