ఫీజు రీ ఎంబర్స్ మెంట్ కోసం విద్యార్ధుల ధర్నా, లాఠీచార్జీ

Published : Aug 22, 2019, 01:45 PM ISTUpdated : Aug 22, 2019, 05:11 PM IST
ఫీజు రీ ఎంబర్స్ మెంట్ కోసం విద్యార్ధుల ధర్నా, లాఠీచార్జీ

సారాంశం

ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలను చెల్లించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీకి పాల్పడ్డారు. 

విజయనగరం: ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం కలెక్టరేట్ ముంద ఆందోళనకు దిగిన విద్యార్ధులపై  గురువారం నాడు పోలీసులు లాఠీచార్జీకి దిగారు.

పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించాలని  విద్యార్ధులు ఇవాళ కలెక్టరేట్ ముందు బైఠాయించారు. అంతేకాదు విశాఖపట్టణం రాయపూర్ జాతీయ రహదారిని  కూడ దిగ్భంధించారు.

దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఆందోళన చేస్తున్న విద్యార్ధులకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ తమ డిమాండ్లపై  స్పష్టత వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్ధులు చెప్పారు. దీంతో విద్యార్ధులపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం