రూ. 33 వేల కోట్ల పెట్టుబ‌డులు, 34 వేల‌కిపైగా ఉద్యోగాలు.. ఏపీలో పారిశ్రామిక విప్ల‌వం

Published : May 15, 2025, 04:22 PM IST
రూ. 33 వేల కోట్ల పెట్టుబ‌డులు, 34 వేల‌కిపైగా ఉద్యోగాలు.. ఏపీలో పారిశ్రామిక విప్ల‌వం

సారాంశం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పారిశ్రామిక అభివృద్ధిలో దూసుకుపోతోంది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యూహాత్మక పారిశ్రామిక విధానాల వల్ల దేశీయ, విదేశీ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి.   

గురువారం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 6వ SIPB (స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33,720 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 34,621 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఇప్పటివరకు జరిగిన మొత్తం 6 SIPB సమావేశాల్లో 76 ప్రాజెక్టులకు రూ.4.95 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపగా, వాటి ద్వారా 4.5 లక్షల మందికి ఉద్యోగాలు కలుగనున్నాయి. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు. ఒప్పందాలు చేసుకున్న సంస్థల పనులను డాష్‌బోర్డ్ ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిని అధికారులు నిరంతరంగా ఫాలోఅప్ చేయాల‌న్నారు. ప్రాజెక్టుల స్థాయిపై ప్రభుత్వానికి సకాలంలో అప్‌డేట్స్ అందించాలని, కొత్త పెట్టుబడులతో పాటు, ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న సంస్థల పురోగతిపై కూడా వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. 

టూరిజం పై దృష్టి:

* 50,000 హోటల్ రూములు అందుబాటులోకి తేవాలని లక్ష్యం.

* కారవాన్ టూరిజం పాలసీ రూపొందించి అమలులోకి తేవాలని సూచన.

* దేవాలయాల పరిసరాల్లో వసతి సౌకర్యాలను మెరుగుపరచాలని ఆదేశాలు.

* గోదావరి, కృష్ణా నదుల వద్ద హారతుల కార్యక్రమాలకు ఆధ్యాత్మిక వైభవం పెంచేలా చర్యలు తీసుకోవాలి.

6వ SIPB ఆమోదించిన 19 ప్రాజెక్టుల వివరాలు:

ఐ & సి విభాగం:

* డెక్కన్ ఫైన్ కెమికల్స్ – రూ.1,560 కోట్లు – 1,800 ఉద్యోగాలు

* భారత్ ఎలక్ట్రానిక్స్ – రూ.1,400 కోట్లు – 800 ఉద్యోగాలు

* పీయూర్ఎనర్జీ – రూ.1,286 కోట్లు – 1,200 ఉద్యోగాలు

* బ్లూ జెట్ హెల్త్ కేర్ – రూ.2,300 కోట్లు – 1,750 ఉద్యోగాలు

* జుపిటర్ రెన్యూవబుల్స్ – రూ.2,700 కోట్లు – 2,216 ఉద్యోగాలు

టెక్స్‌టైల్:

*  రాంభద్ర ఇండస్ట్రీస్ – రూ.228 కోట్లు – 250 ఉద్యోగాలు
* మోహన్ స్పింటెక్స్ – రూ.482 కోట్లు – 1,525 ఉద్యోగాలు
* ఏటీసీ టైర్స్ – రూ.1,779 కోట్లు – 600 ఉద్యోగాలు

APIIC విభాగం:

*  వింగ్‌టెక్ మొబైల్ – రూ.1,061 కోట్లు – 10,098 ఉద్యోగాలు
* అలీప్ కుప్పం – రూ.5 కోట్లు – 1,500 ఉద్యోగాలు

ఎనర్జీ విభాగం:

* నితిన్ సాయి కనస్ట్రక్షన్స్ – రూ.150 కోట్లు – 500 ఉద్యోగాలు

* దేశ్‌రాజ్ సోలార్ – రూ.2,920 కోట్లు – 230 ఉద్యోగాలు

*  ఆంప్లస్ ఎనర్జీ – రూ.3,941 కోట్లు – 260 ఉద్యోగాలు

* బొండాడ ఇంజనీరింగ్ – రూ.9,000 కోట్లు – 3,900 ఉద్యోగాలు

టూరిజం:

* బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ – రూ.150 కోట్లు – 350 ఉద్యోగాలు

* స్రవంతి హోటల్స్ – రూ.327 కోట్లు – 570 ఉద్యోగాలు

* వరుణ్ హాస్పటాలిటీ – రూ.899 కోట్లు – 1,300 ఉద్యోగాలు

ఐటీ:

*  డైకిన్ ఇండియా – రూ.2,475 కోట్లు – 5,150 ఉద్యోగాలు

* సెన్సోరెమ్ ఫోటోనిక్స్ – రూ.1,057 కోట్లు – 622 ఉద్యోగాలు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu