ముగిసిన ఎండీల భేటీ : టీఎస్ఆర్టీసీ ముందు ఏపీఎస్ఆర్టీసీ డిమాండ్లు

Siva Kodati |  
Published : Sep 15, 2020, 09:30 PM IST
ముగిసిన ఎండీల భేటీ : టీఎస్ఆర్టీసీ ముందు ఏపీఎస్ఆర్టీసీ డిమాండ్లు

సారాంశం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య బస్సుల రాకపోకలకు సంబంధించి మంగళవారం ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం ముగిసింది. ఈ భేటీ అనంతరం ఏపీఎస్ఆర్టీసీ మీడియాతో మాట్లాడుతూ.. అంతర్రాష్ట్ర బస్సుల సర్వీసుల పునరుద్ధరణ, కిలోమీటర్లపై చర్చ జరిగింది. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య బస్సుల రాకపోకలకు సంబంధించి మంగళవారం ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం ముగిసింది. ఈ భేటీ అనంతరం ఏపీఎస్ఆర్టీసీ మీడియాతో మాట్లాడుతూ.. అంతర్రాష్ట్ర బస్సుల సర్వీసుల పునరుద్ధరణ, కిలోమీటర్లపై చర్చ జరిగింది.

ఏ రూట్లలో ఎన్ని బస్సులు నడపాలనే అంశంపైనా చర్చించామని కృష్ణబాబు పేర్కొన్నారు. సమాన కిలోమీటర్లకు ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపుతోందని ఆయన అన్నారు. బస్సుల పునరుద్దరణ కోసం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ పంపామని... కిలోమీటర్ల గ్యాప్ 50 శాతం తగ్గించేందుకు తాము అంగీకరించామని కృష్ణబాబు తెలిపారు.

తెలంగాణ ఆర్టీసీని 50 శాతం పెంచుకోమని చెప్పామని.. రాష్ట్ర విభజనకు ముందు 3.43 లక్షల కిలోమీటర్లు ఏపీ బస్సులను నడిపామని ఆయన పేర్కొన్నారు. విభజన తర్వాత తెలంగాణలో 2.65 లక్షల కిలోమీటర్లకు బస్సులు తిప్పుతున్నామని.. 71 రూట్లలో ఏపీ, 28 రూట్లలో తెలంగాణ బస్సులు తిప్పుతుందని కృష్ణబాబు వెల్లడించారు.

1.1 లక్షల కిలోమీటర్లు రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్ ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిని తాము 50 వేల కిలోమీటర్లు తగ్గిస్తామని.. మీరు  పెంచాలని తెలంగాన వాళ్లను కోరామిన కృష్ణబాబు వెల్లడించారు.

1.10 వేల కిలోమీటర్ల నుంచి 1.60 వేల కిలోమీటర్ల వరకు పెంచడానికి తెలంగాణ ముందుకు వచ్చిందని చెప్పారు. అంతకుమించి పెంచే సామర్థ్యం తమకు లేదని.. లాభదాయకంగా ఉండదని తెలంగాణ చెబుతోందని కృష్ణబాబు తెలిపారు.

అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీఎస్ఆర్టీసీకి అనుమతి వుందని ఆయన గుర్తుచేశారు. ఇతర రాష్ట్రాల నుంచి రూట్ వైజ్ క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ అడిగిందని.. అయితే ఇప్పటి వరకు ఏ రాష్ట్రం ఇలాంటి ప్రతిపాదన పెట్టలేదని కృష్ణబాబు చెప్పారు.

70 వేల కిలోమీటర్లు మేర ఇరు రాష్ట్రాలు 250 బస్సులు తిప్పితే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని తాము భావించడం లేదని.. సర్వీసుల పునరుద్ధరణపై ప్రతిష్టంభన ఇలానే ఉంటే ప్రైవేట్ ఆపరేటర్లకు లాభం చేకూరుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు రోజుల్లో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించామని.. తుది నిర్ణయం తీసుకునే వరకు ఇరు రాష్ట్రాలు 250 బస్సుల చొప్పున నడిపేందుకు అనుమతి ఇవ్వాలని అడిగామని కృష్ణబాబు చెప్పారు. అంతరాష్ట్ర బస్సులపై క్లారిటీ వచ్చిన తరువాతే ఇస్తామని టీఎస్ అధికారులు చెప్పారు' అని ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపారు.

దీనిపై టీఎస్ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్ శర్మ మాట్లాడుతూ... రూట్ల వారీగా రెండు రాష్ట్రాలు సమానంగా నడపాలని ప్రతిపాదన తెచ్చామని ఆయన వెల్లడించారు. రూట్ల వారీగా క్లారిటీ ఇస్తేనే తాము ముందుకు వెళ్తామని, రెండు రాష్ట్రాలు అగ్రిమెంట్ ప్రకారం ముందుకు వెళతామని సునీశ్ శర్మ చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Republic Day Celebrations 2026: గణతంత్ర వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పీచ్ | Asianet Telugu
Republic Day Celebrations in Amaravati: చంద్రబాబుకి పవన్ కి లోకేష్ ఘన స్వాగతం| Asianet News Telugu