ఏపీలో 5 వేలు దాటిన మరణాలు: 5,83,925కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Sep 15, 2020, 07:48 PM IST
ఏపీలో 5 వేలు దాటిన మరణాలు: 5,83,925కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 8,846 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 8,846 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,83,925కి చేరింది.

నిన్న ఒక్క రోజే కోవిడ్ కారణంగా 69 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,041కి చేరుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 92,353 యాక్టివ్ కేసులున్నాయి.

గడిచిన 24 గంటల్లో 9,628 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,86,531కి చేరింది. నిన్న ఒక్క రోజే అనంతపురం 299, చిత్తూరు 572, తూర్పుగోదావరి 1,423, గుంటూరు 641, కడప 661, కృష్ణ 398, కర్నూలు 314, నెల్లూరు 820, ప్రకాశం 979, శ్రీకాకుళం 678, విశాఖపట్నం 574, విజయనగరం 532, పశ్చిమ గోదావరి 955 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో ప్రకాశం 10, చిత్తూరు 9, అనంతపురం 6, తూర్పుగోదావరి 6, కృష్ణ 6, కడప 5, విశాఖపట్నం 5, గుంటూరు 4, నెల్లూరు 4, విజయనగరం 4, పశ్చిమగోదావరి 4, కర్నూలు 3, శ్రీకాకుళంలలో ముగ్గురు మరణించారు. 

 

 

 

 

PREV
click me!

Recommended Stories

10వేల కోట్ల పెట్టుబ‌డులు, 4వేల మందికి ఉద్యోగాలు ఏపీలో భారీ ప్రాజెక్టు| Anantapur Wind Energy Project
జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami