AP 10th Class Results 2025: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్, మన మిత్ర వాట్సప్, లీప్ యాప్‌లో రిజల్ట్స్ చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఏడాది సుమారు ఆరు లక్షలకు పైగా విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాశాలు. వీరందరూ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్, మన మిత్ర వాట్సప్, లీప్ యాప్‌లో రిజల్ట్స్ చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఏడాది సుమారు ఆరు లక్షలకు పైగా విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాశాలు. వీరందరూ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
పదో తరగతి, ఒపెన్ స్కూల్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. విద్యార్థులు సులువుగా వాట్సప్‌లో 9552300009 అనే నంబర్‌ను సేవ్ చేసుకుని హాయ్ అని సందేశం పంపాలి. ఆ తర్వాత పదో తరగతి ఫలితాలను ఎంపిక చేసుకుని అక్కడ రోల్ నంబర్, డేటాఫ్ బర్త్ నమోదు చేస్తే క్షణాల్లో పీడీఎఫ్ రూపంలో ఫలితాలు వచ్చేస్తాయి.
ప్రభుత్వం ఇటీవల లీప్ అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకుంది. దీని ద్వారా ఉపాద్యాయులు, ప్రధనోపాధ్యాయులు వారి పాఠశాలల్లోని విద్యార్థుల ఫలితాలు చూసుకోవచ్చు. ఇక ఇదే యాప్‌లో తల్లిదండ్రులు కూడా లాగిన్ అయి.. వారి పిల్లల ఫలితాలను చూసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్‌లో కూడా మార్కులు చూసుకునే వెసులుబాటు అధికారులు కల్పించారు. విద్యార్థులు ఫలితాల కోసం వెబ్ సైట్‌ను సందర్శించి ఫలితాలను చూసుకోవచ్చు.
వెబ్‌సైట్ లింక్ https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/