AP Liquor Scam: రాజకీయం.. వ్యాపారాం.. రెండూ ఓ తాను ముక్కలే.. ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది. అయితే.. రాజకీయమైనా.. వ్యాపారమైనా పద్దతిగా చేస్తే బాగుంటుంది.. లేదంటే దివాలా తీయాల్సి వస్తుంది. దేనికైనా కక్కుర్తి పడకూడదు అంటారు. కానీ ఏపీ లిక్కర్ స్కాంలో జరిగింది ఇదే. అత్యాసకు పోయి అడ్డంగా బుక్కయ్యారు. చివరికి బిగ్‌బాస్‌కు ఈ మద్యం స్కాం చుట్టుకునేలా ఉంది. ఈ విషయం పక్కన పెడితే.. ఈ స్కాంలోకి ఓ కొత్త పేరు వచ్చింది.. అదే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. అసలు ఎవరీ కసిరెడ్డి.. గత వారం పది రోజులుగా ఏపీ ప్రజలకు అర్థం కావడం లేదు. ఇతనికీ ఈ స్కాంకు ఏంటి సంబంధం.. ఎక్కడి వ్యక్తి.. బిగ్‌బాస్‌కు ఎలా దగ్గరయ్యాడు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
రాజ్ కసిరెడ్డిది కడప జిల్లా. తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. రాజ్ సాఫ్ట్ వేర్ డెవలపర్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, హైదరాబాద్‌లో వ్యాపారం చేస్తుంటాడు. డబ్బులు ఉంటే రాజకీయాలు చేయాలి కదా.. అడపాదడపా రాజకీయ కార్యక్రమాల్లోయాక్టివ్ గా ఉండేవాడు. 2019 ఎన్నికలకు ముందు బిగ్‌బాస్‌ని కలిసి వైసీపీలో చేరాడు. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో ప్రభుత్వ ఐటీ సలహాదారుగా కసిరెడ్డి నియమితులయ్యాడు.
బిగ్‌బాస్‌కి అక్కడ నచ్చాడు..
బిగ్‌బాస్‌ది రాజ్‌కి బంధుత్వం అని అంటున్నారు. అయితే దీనికి ఆధారాలు లేవు. కానీ వ్యాపారం, రాజకీయంగా బంధుత్వం ఏర్పడిందని చెబుతున్నారు. దీంతో అత్యంగ క్లోజ్ గా బిగ్‌బాస్‌కు ఉండేవాడట. అంతేకాదు.. కసిరెడ్డికి దుబాయ్‌లో లిక్కర్ వ్యాపారాలు ఉన్నాయంట. అక్కడ అతగాడు చేసే వ్యాపార రహస్యాలను ఇక్కడ బిగ్‌బాస్‌కు చెప్పి.. ఏపీలో పాగా వేశాడంట. అసలు బిగ్‌బాస్‌తో సమస్య ఏంటంటే.. డబ్బులు ఎవడు ఇస్తే.. వాడే మన మనిషి అని ఫీలవుతుంటాడని, అతని స్థానం వేరే లెవల్‌లో ఉంటుందని బిగ్‌బాస్ సన్నిహితులు చెబుతున్నారు. ఇక్కడే కసిరెడ్డి బిగ్‌బాస్‌కి నచ్చాడంట.
విజయసాయిరెడ్డి పుణ్యమా అని..
ఎంపీ విజయసాయి రెడ్డి పుణ్యమా అని ఏపీ లిక్కర్ స్కాంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. అందుకే కసిరెడ్డికి విజయసాయి రెడ్డి అంటే పట్టలేని కోపం. ఇటీవల విడుదల చేసిన ఆడియోలో కూడా బూతులు తిట్టింది అందుకే. ఇక రాజ్ కసిరెడ్డి పాత్ర వచ్చేసరికి.. ఏపీలో మద్యం దుకాణాలకు తను సూచించిన డిస్టలరీల నుంచి మద్యం సరఫరా చేపించడం. ఆ డిస్టలరీల నుంచి నెల నెలా పెద్దమొత్తంలో లంచాలు కలెక్ట్ చేసే టీంని రన్ చేయడం. అంతేకాదు.. ఏ బ్రాండ్ ఎంతకు అమ్మాలో కూడా కసిరెడ్డి నిర్ణయమేనట. బ్రాండ్లు పేర్లు, ధర మనోడు ఎంత చెబితే అంత.. ఏది చెబితే అదే డిస్టలరీలు విక్రయించేవట.
బిగ్‌బాస్‌కి డబ్బులు అందాయా లేదా..
మీరు లవ్ స్టోరీ సినిమాకు వెళ్లి చివరిలో బయటకు వచ్చేసి హీరో, హీరోయిన్లు పెళ్లిచేసుకునేది ఎంత నిజమో.. ఏపీలో రూ.3 వేల కోట్ల లిక్కర్ స్కాం జరగడమేంటి.. అందులో బిగ్‌బాస్‌కు డబ్బులు వెళ్లడం కూడా అంతే నిజం.. చాలా మంది రాజకీయ వేత్తలు ఢిల్లీ మద్యం స్కాం కంటే ఏపీ మద్యం స్కాం పెద్దదని ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికి కళ్లు తెరిచి కేసు విచారణ సాగిస్తోంది. అయితే.. గతంలో కూడా అనేక కేసులను ఇలాగే వెలుగులోకి తీసుకొచ్చి హడావిడి చేయడం.. సరైన ఆధారాలు సమర్పించలేక కేసు నీరుగారిపోవడం ఏపీ ప్రజలు చూశారు. ఇప్పటికైతే రోజుకో లీక్,అప్డేట్‌తో సినిమా రక్తి కట్టిస్తున్నారు. మరి క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఏమవుతుందో చూడాలి.