Omicron in AP: ప్రకాశం జిల్లాలో మహిళకు ఒమిక్రాన్, 17కు చేరిన కేసులు

By Pratap Reddy Kasula  |  First Published Dec 31, 2021, 9:16 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. దీంతో ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 17కు చేరుకుంది. ప్రకాశం జిల్లాలోని ఓ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. ప్రకాశం జిల్లాలోని ఓ మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Omicron కేసుల సంఖ్య 17కు చేరుకుంది. ఒమిక్రాన్ పాజిటివ్ నిర్దారణ అయిన మహిళ ఆరోగ్యంగానే ఉందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న 14 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు, వారికి Corona నెగెటివ్ వచ్చిందని వారు చెప్పారు. 

ఏపీలో కరోనా వైరస్ విస్తరిస్తోంది. కొత్తగా 130 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. దాంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య గురువారంనాటికి 20 లక్షల 74 వేల 084కి చేరుకుంది. గురువారంనాడు కరోనా వైరస్ తో ఒకరు మరణించారు. దీంతో ఏపీలో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 14,493కు చేరుకుంది. కోవిడ్ కారణంగా నెల్లురు జిల్లాలో ఒకరు మరణించారు. 

Latest Videos

undefined

Also Read: ఏపీ: కొత్తగా 130 మందికి పాజిటివ్.. విశాఖలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు

విశాఖపట్నం జిల్లాలో కరోనా వైరస్ ఒక్కసారిగా విజృంభించింది. గురువారంనాడు విశాఖపట్నం జిల్లాలో 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో New year celebrationsపై Visakhapatnam జిల్లాలో కఠినమైన ఆంక్షలు విధించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ నెల 21వ తేదీన ఏలూరు రూరల్ పత్తికోళ్ల లంకలో కువైట్ నుంచి వచ్చిన 41 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది. జిల్లాలో ఇదే తొలి ఒమిక్రాన్ కేసు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమెను హోం ఐసోలేషన్ లో ఉంచామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. 

Also Read: కర్నూలు జిల్లాలో ఒమిక్రాన్ కలకలం.. డోన్‌లో భార్యాభర్తలకు పాజిటివ్, భయాందోళనలో జనం

గత 45 రోజుల్లో జిల్లాకు 6,856 మంది విదేశాల నుంచి వచ్చారని, వారికి విమానాశ్రయంలోనే ఆర్టీపీసీ పరీక్షలు చేయించామని, చెప్పారు. వారిలో 14 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయిందని చెప్పారు. పండుగల సీజన్ కావడంతో బయటి నుంచి ఎక్కువగా ప్రజలు వస్తున్నారని ఆయన చెప్పారు. 

కర్నూలు జిల్లాలో భార్యాభర్తలకు ఒమిక్రాన్ సోకినట్లు బుధవారంనాడు అధికారులు వెల్లడించారు. దుబాయ్ లోని బంధువుల వద్దకు వారి వెళ్లి వచ్చారని, వారికి పరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిందని అదికారులు చెప్పారు. బుధవారంనాటికి ఏపీలో 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆ సంఖ్య 17కు చేరుకుంది.

Also Read: పశ్చిమ గోదావరి జిల్లాలో ఒమిక్రాన్ టెన్షన్.. ప్రజలను హెచ్చరించిన జిల్లా కలెక్టర్

click me!