చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ: రాజీనామా బాటలో మరో ఎంపీ

By Nagaraju penumalaFirst Published Feb 14, 2019, 2:16 PM IST
Highlights

ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. అమలాపురం పార్లమెంట్ పరిధిలో తనకు గుర్తింపు లేకుండా తెలుగుదేశం పార్టీలో కొందరు నేతలు వ్యవహరిస్తున్నారని తాను ఎన్నిసార్లు అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం మాత్రం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

అమలాపురం: తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న ఆయన ఇక పార్టీకి గుడ్ బై చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 కోనసీమకు రైలును తీసుకువచ్చే విషయంపై కేంద్రంతో అలుపెరగని పోరాటం చేస్తున్నారు ఎంపీ పండుల రవీంద్రబాబు. అయితే అందుకు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం సహకరించడం లేదని ఆయన సన్నిహితులవద్ద వాపోయినట్లు తెలుస్తోంది. 

ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. అమలాపురం పార్లమెంట్ పరిధిలో తనకు గుర్తింపు లేకుండా తెలుగుదేశం పార్టీలో కొందరు నేతలు వ్యవహరిస్తున్నారని తాను ఎన్నిసార్లు అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం మాత్రం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

పార్లమెంట్ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ఆయన ఇక తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా పడిన అనంతరం నుంచి ఆయన అందుబాటులో లేరని ప్రచారం జరుగుతుంది. 

గురువారం ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ కు సైతం ఎంపీ అవంతి శ్రీనివాస్ తోపాటు పండుల రవీంద్రబాబు కూడా గైర్హాజరయ్యారని ప్రచారం జోరుగా సాగుతోంది. 

మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు వైసీపీ కండువా కప్పుకోనున్నారని ప్రకటించింది. ఈ పరిణామాలు నేపథ్యంలో పండుల రవీంద్రబాబు పార్టీ వీడతారంటూ వస్తున్న వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.  

ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీలోకి ఇద్దరు టీడీపీ ఎంపీలు: క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి

టీడీపికి అవంతి రాజీనామా: సబ్బం హరికి లైన్ క్లియర్

త్యాగానికి గంటా రెడీ: టీడీపీ నేతల టచ్ లోకి రాని అవంతి

టీడీపీకి అవంతి రాజీనామా, రేపు జగన్‌ను కలిసే అవకాశం

చంద్రబాబుకు మరో షాక్: వైసీపీలోకి అవంతి, ముహూర్తం ఖరారు

చంద్రబాబుకు మరో షాక్: వైసీపీలోకి అవంతి, ముహూర్తం ఖరారు

టీడీపీకి మరోషాక్: వైసీపీలోకి సిట్టింగ్ ఎంపీ..?

click me!