AP లో మరో భారీ ప్రాజెక్ట్‌.. రూ. 1500 కోట్లతో Green Field Cement Plant

Published : Dec 20, 2021, 07:17 PM IST
AP లో మరో భారీ ప్రాజెక్ట్‌.. రూ. 1500 కోట్లతో Green Field Cement Plant

సారాంశం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌రో భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో రూ. 1500 కోట్లతో గ్రీన్‌ ఫీల్డ్‌ సిమెంట్‌ ప్లాంట్‌( Green Field Cement Plant) ఏర్పాటు కాబోతుంది. ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి శ్రీ‌  సిమెంట్‌ కంపెనీ ముందుకు వ‌చ్చింది. ఈ ప్లాంట్ ను 24 నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళికలు సిద్దం చేశారు. ఇప్పటికే 9 రాష్ట్రాలలో సిమెంట్‌ తయారీ, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్లాంట్స్‌ ఏర్పాటు చేయబోతున్న‌ట్టు శ్రీ సిమెంట్‌ గ్రూప్ ప్ర‌క‌టించింది.    

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో  మరో భారీ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధం అవుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో రూ. 1500 కోట్లతో గ్రీన్‌ ఫీల్డ్‌ సిమెంట్‌ ప్లాంట్‌( Green Field Cement Plant)ఏర్పాటు చేసేందుకు శ్రీ సిమెంట్ ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టును  24 నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళికలు సిద్దం చేశారు.  ఇప్పటికే 9 రాష్ట్రాలలో సిమెంట్‌ తయారీ, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్లాంట్స్‌ ఏర్పాటు చేసింది శ్రీ సిమెంట్‌ గ్రూప్. ఈ గ్రూప్‌ నుంచి ఏపీలో మొట్టమొదటి ప్రాజెక్ట్‌ రాబోతోంది.
 
ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి చర్చించారు సిమెంట్‌ లిమిటెడ్‌ ఎండీ హెచ్‌ఎం.బంగూర్, జేఎండీ ప్రశాంత్‌ బంగూర్‌. ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, పారిశ్రామిక వర్గాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలపై శ్రీ సిమెంట్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌తో సీఎం జ‌గ‌న్ చర్చించారు. ఈ సందర్భంగా శ్రీ సిమెంట్‌ ఎండీ హెచ్‌ఎం.బంగూర్, జేఎండీ ప్రశాంత్‌ బంగూర్‌లు మాట్లాడారు. 

READ ALSO: 

ఈ సంద‌ర్భంగా.. శ్రీ సిమెంట్‌ ఎండీ హెచ్‌ఎం.బంగూర్ మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికోసం సీఎం జ‌గ‌న్  చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు. ఒక కంపెనీ  సీఈఓ ఏరకంగా ఆ కంపెనీ బాగోగులు చూసుకుంటారో.. అలాగే రాష్ట్ర ప్ర‌జ‌ల‌ బాగోగులను చూస్తున్నార‌ని ప్ర‌శంసించారు. ప్రజలకు మెరుగైన ఆదాయాలు రావాలని సీఎం జ‌గ‌న్ ఆకాంక్షిస్తున్నారని, రాష్ట్రంలో పారిశ్రామికీరణ పెద్ద ఎత్తున జరగాలని సీఎం కోరుకుంటున్నార‌ని తెలిపారు. దీనివల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఆదాయాలు రావాలన్నది సీఎం ఉద్దేశమ‌ని శ్రీ సిమెంట్‌ ఎండీ  అన్నారు.  

READ ALSO: స్వయంగా చావు డప్పు కొట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్... మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ నిరసన (ఫోటోలు)
 

దేశంకంటే రాష్ట్ర వృద్దిరేటు ఎక్కువ‌గా ఉంద‌నీ, భవిష్యత్తులో ఇది మరింత పెరుగుతుందన్న‌డంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. సీఎం జ‌గ‌న్  ఆలోచనా దృక్పథంతో రాష్ట్రాభివృద్ధి మరింత  పురోగమిస్తుందని, అందువల్లే తాము ఏపీలో భారీ ప్లాంట్‌ ఏర్పాటు చేయబోతున్నామ‌ని  సిమెంట్‌ ఎండీ హెచ్‌ఎం.బంగూర్ అన్నారు. శ్రీ సిమెంటు ప్లాంటులో పనిచేసేవారికి జీతాల రూపంలో కాని, పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారికి గాని నెలకు కనీసంగా రూ.20 కోట్ల రూపాయలు, రోజుకు కనీసంగా రూ.70 లక్షలు రూపాయలు నేరుగా చెల్లిస్తున్నాం, రోజువారీ ఉపాధి కార్యక్రమాల్లో భాగంగా డబ్బును వారికి ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. 

READ ALSO: వైసీపీ నేత సుబ్బారావుపై సుభాని వర్గీయుల దాడి: వద్దని చెప్పానన్న మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి

అనంత‌రం.. జేఎండీ ప్రశాంత్‌ బంగూర్ మాట్లాడుతూ.. పెద్ద సిమెంటు ప్లాంటు ఏర్పాటు వల్ల మంచి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందని , దీంతో అనేక‌ మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి ల‌భిస్తోంద‌ని అన్నారు. పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, సర్వీసులను అందించే క్రమంలో చాలామందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని , వేలమందికి లబ్ధి జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీ పి వి.మిథున్‌ రెడ్డి, శ్రీ సిమెంట్‌ ప్రెసిడెంట్‌ (కమర్షియల్‌) సంజయ్‌ మెహతా, జీఎం జీవీఎన్‌.శ్రీధర్‌ రాజు, మేనేజర్‌ వెంకటరమణ, అసిస్టెంట్‌ మేనేజర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్