అందుకే ఇల్లు కదలడం లేదేమో : సీఎం జగన్‌పై నాదెండ్ల మనోహర్ విమర్శలు

Siva Kodati |  
Published : Nov 28, 2021, 10:46 PM IST
అందుకే ఇల్లు కదలడం లేదేమో : సీఎం జగన్‌పై నాదెండ్ల మనోహర్ విమర్శలు

సారాంశం

వైసీపీ (ysrcp govt) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు జనసేన (janasena party) పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (nadendla manohar) .  ప్రజల దగ్గరకు వెళితే ఏం అడుగుతారో భయం వచ్చేసిందని.. వేలాది మంది పోలీసుల సాయం లేనిదే బయటకు పోవడం లేదని ఆయన ఆరోపించారు.

వైసీపీ (ysrcp govt) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు జనసేన (janasena party) పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (nadendla manohar) . రాష్ట్రంలో అత్యవసర పరిస్ధితులు ఏర్పడ్డాయని.. స్వ ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థను వారు అనుకున్న పథకాలకు పరిమితం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఏ మాత్రం పరిపాలనా దక్షత లేని నాయకుడి వల్ల ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందని నాదెండ్ల ఎద్దేవా చేశారు. రూ. 6 లక్షల కోట్ల అప్పులు  చేసినట్లు కాగ్ లెక్కలు చెప్పిందని.. మరి ఈ అప్పు ఎటుపోయిందని నాదెండ్ల ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మౌలిక వసతుల కల్పన కోసం ఒక్క అడుగు వేసింది లేదని మనోహర్ ఎద్దేవా చేశారు. 

యువకుడని జనం జగన్‌కి (ys jagan mohan reddy) ముఖ్యమంత్రి పదవి అప్పగించారని.. ఆయనేమో ఇంటి నుంచే పనిచేస్తున్నారని మనోహర్ దుయ్యబట్టారు. ప్రజల దగ్గరకు వెళితే ఏం అడుగుతారో భయం వచ్చేసిందని.. వేలాది మంది పోలీసుల సాయం లేనిదే బయటకు పోవడం లేదని ఆయన ఆరోపించారు. గత నెలలో ఒంగోలులో ఓ సభ పెట్టారని.. మహిళలకు ఆసరా పధకం కింద బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారని.. ఈ మీటింగ్‌కు రాష్ట్ర నలుమూలల నుంచి పోలీసుల్ని తీసుకొచ్చారని మనోహర్ దుయ్యబట్టారు. శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్న తీరు చూస్తే అసహ్యం వేస్తోందని.. గతంలో శాసనసభలో గారుకు బదులు గాడు అంటే వెంటనే స్పీకర్ కల్పించుకుని క్షమాపణలు చెప్పించారని ఆయన గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఆ గౌరవం ఎక్కడా కనిపించడం లేదని మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read:వరద నష్టంపై సమగ్ర సమాచారం లేదు: జగన్ సర్కార్ పై నాదెండ్ల ఫైర్

ఇక గురువారం నాడు తిరుపతిలో  Nadendla Manohar మీడియాతో మాట్లాడుతూ... ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో Ys jagan ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరు కూడా సరిగా లేదని  మనోహర్ ఆరోపించారు.kadapa జిల్లాలోని మండపల్లె గ్రామంలోనే  15 పశువులు వరదలో మృత్యువాత పడ్డాయని ఆయన చెప్పారు.  రాష్ట్రంలో Heavy rains కారణంగా జరిగిన నష్టంపై కచ్చితమైన లెక్కలు ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. crop నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో  చోటు చేసుకొన్న వరద నష్టానికి సుమారు రూ. 1000 కోట్లు అందించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.  ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు కూడా ఆయన లేఖలు రాశారు. భారీ వర్షాల కారణంగా ఏపీ రాష్ట్రంలోన కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ మూడు జిల్లాలో  పెద్ద ఎత్తున ఆస్తి నష్టం చోటు చేసుకొంది

PREV
click me!

Recommended Stories

Markapuram Bus Accident : ప్రమాదమని తెలిసినా..మార్కాపురం బస్సుఘటనలో తప్పెవరిది?| Asianet News Telugu
Markapuram Bus Accident:మార్కాపురంలో ఘోర ప్రమాదం | Chandrababau | Pawan Kalyan | Asianet News Telugu