Breaking : ఆంధ్ర ప్రదేశ్ లో ఘోర రోడ్డుప్రమాదం... ఆరుగురు మృతి

Published : May 04, 2025, 07:32 AM ISTUpdated : May 04, 2025, 07:52 AM IST
Breaking : ఆంధ్ర ప్రదేశ్ లో ఘోర రోడ్డుప్రమాదం... ఆరుగురు మృతి

సారాంశం

రెండు లారీల మధ్య ఓ కారు నలిగిపోయి ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఆంధ్ర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘోరం ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  

Prakasam Road Accident : ఆంధ్ర ప్రదేశ్ లో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోడిగుడ్ల లోడ్ తో వెళుతున్న ఓ లారీ ప్రకాశం జిల్లాలో బోల్తాపడింది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన దాని వెనకాల కారులోని వారు సడన్  గా ఆగిపోయారు... ఇలా ప్రమాదం నుండి తప్పించుకున్నామని అనుకుంటుండగానే వెనకాల నుండి మరో లారీ మృత్యువు రూపంలో వచ్చింది. వేగంగా దూసుకువస్తున్న లారీ అదుపుతప్పి కారుపైకి దూసుకెళ్లింది... దీంతో ముందు బోల్తాడపడి లారీ, వెనకాల లారీ మధ్యలో కారు నలిగిపోయి నుజ్జునుజ్జయ్యింది.  

ఒంగోలు మండలం కొప్పోలు వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బోల్తాపడిన లారీతో పాటు కారులోనివారు ప్రాణాలు కోల్పోయారు. ఇలా మొత్తం ఆరుగురు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

ఈ ఘోర రోడ్డుప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. బోల్తాపడిన లారీతో పాటు కారులోని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం వాహనాలను రోడ్డుపక్కకు జరిపి ట్రాఫిక్ ను క్లియర్ చేసారు. 
 
లారీ డ్రైవర్ల నిద్రమత్తు, అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు.  మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామని... మృతుల కుటుంబాలకు సమాచారం అందిస్తామని పోలీసులు తెలిపారు. 

అర్ధరాత్రి హైదరాబాద్ లో ఘోర రోడ్డుప్రమాదం.. 

గత అర్ధరాత్రి హైదరాబాద్ శివారుప్రాంతం రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహేశ్వరం మండలం తుమ్మలూరు గేట్ వద్ద ఆర్టిసి బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డీకొన్నాయి. రోడ్డుపక్కన పార్క్ చేసివున్న టిప్పర్ ను తప్పించే క్రమంలో రెండుబస్సులు ఢీకొన్నాయి.   

ఈ ప్రమాద సమయంలో రెండు బస్సుల్లోనూ ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 15 మంది తీవ్రంగా గాయపడగా మరో 10 మంది  స్వల్ప గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం కారణంగా శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాపిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న మహేశ్వరం పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయపడినవారిని 108 వాహనంలో హాస్పిటల్ కు తరలించారు. భారీ క్రేన్ సాయంతో రోడ్డుపైనుండి వాహనాలను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేసారు. అయితే ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నవారిలో ఎనిమిదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాద సమయంలో రెండు బస్సుల్లో కలిసి మొత్తం 150 మంది ప్రయాణికులు ఉండగా వీరిలో 38 మంది గాయపడ్డారు. మిగతావారు సురక్షితంగా ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

 

 


 
 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే