ఏపీలో రెండు కరోనా కేసులు.. ప్రభుత్వం అలర్ట్

By telugu news teamFirst Published Mar 19, 2020, 10:28 AM IST
Highlights

రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 109 మంది రక్త నమూనాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు.అయితే.. వారిలో 94మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని చెప్పారు. మరో 13మంది రక్త పరీక్షల రిజల్ట్ ఇంకా తెలియలేదని చెప్పారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా విజృంభిస్తోంది. ఏపీలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో  ఒకరికి కరోనా సోకగా... తాజాగా ప్రకాశం జిల్లాలోనూ మరొకరికి కరోనా సోకినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 109 మంది రక్త నమూనాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు.

Also Read లండన్ నుంచి కూతుర్లు వెనక్కి: జగన్ పారాసిటమాల్ వ్యాఖ్యలపై సెటైర్లు...

అయితే.. వారిలో 94మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని చెప్పారు. మరో 13మంది రక్త పరీక్షల రిజల్ట్ ఇంకా తెలియలేదని చెప్పారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఇదిలా ఉండగా... ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగానే పాఠశాలలు, కాలేజీలు, యూనివర్శిటీలు, కోచింగ్ సెంటర్ లకు సెలవు ప్రకటించారు. కాగా.. పరీక్షల షెడ్యూల్ మాత్రం యథావిధిగా ఉందని.. ఈ నెల 31 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కాగా.. చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు. 

click me!