ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 3,765 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8,00,684కి చేరుకొన్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 3,765 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8,00,684కి చేరుకొన్నాయి.
గత 24 గంటల్లో 20 మంది కరోనా మరణించారు.కరోనాతో గుంటూరులో నలుగురు, కడప, కృష్ణా జిల్లాల్లో ముగ్గురి చొప్పున మరణించారరు. అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరిలో ఇద్దరి చొప్పున చనిపోయారు. కర్నూల్, ప్రకాశం, విశాఖపట్టణం, పశ్చిమగోదావరిలలో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారు. దీంతోరాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,544కి చేరుకొంది.
undefined
రాష్ట్రంలో ఇప్పటివరకు 74 లక్షల 28వేల 014 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 80,238 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 3,725మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది.
ఏపీలో ఇప్పటివరకు 7 లక్షల62 వేల 419 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 31,721 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
గత 24 గంటల్లో అనంతపురంలో 152,చిత్తూరులో 347 తూర్పుగోదావరిలో 475, గుంటూరులో 523, కడపలో 225 కృష్ణాలో 460, కర్నూల్ లో 69, నెల్లూరులో 122,ప్రకాశంలో 317, శ్రీకాకుళంలో 190, విశాఖపట్టణంలో 218, విజయనగరంలో 126,పశ్చిమగోదావరిలో 532 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు
అనంతపురం -63,459, మరణాలు 545
చిత్తూరు -75,690,మరణాలు 756
తూర్పుగోదావరి -1,12,661 మరణాలు 597
గుంటూరు -64,372 మరణాలు 602
కడప -50,811 మరణాలు 424
కృష్ణా -36,446మరణాలు 542
కర్నూల్ -59,096 మరణాలు 481
నెల్లూరు -58,790 మరణాలు 483
ప్రకాశం -57,953 మరణాలు 566
శ్రీకాకుళం -43,335 మరణాలు 338
విశాఖపట్టణం -54,693 మరణాలు 497
విజయనగరం -38,699 మరణాలు 226
పశ్చిమగోదావరి -81,784 మరణాలు 487
: 23/10/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 7,97,789 పాజిటివ్ కేసు లకు గాను
*7,59,524 మంది డిశ్చార్జ్ కాగా
*6,544 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 31,721 pic.twitter.com/S4ANh5GgAG