ఏపీపై కరోనా పంజా: 24 గంటల్లో 25 కేసులు, మొత్తం 2330కి చేరిక

By narsimha lodeFirst Published May 17, 2020, 1:54 PM IST
Highlights

 ఏపీ రాష్ట్రంలో 24 గంటల్లో 25 కరోనా కేసులు నమోదయ్యాయి. 9,880 శాంపిల్స్ ను పరీక్షిస్తే 25 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 103 మంది కరోనా వైరస్ తో ఆసుపత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 

న్యూఢిల్లీ: ఏపీ రాష్ట్రంలో 24 గంటల్లో 25 కరోనా కేసులు నమోదయ్యాయి. 9,880 శాంపిల్స్ ను పరీక్షిస్తే 25 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 103 మంది కరోనా వైరస్ తో ఆసుపత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 

 

: రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM)
*9,880 సాంపిల్స్ ని పరీక్షించగా 25 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.
*103 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు.
*కోవిడ్ వల్ల కృష్ణ లో ఒక్కరు మరణించారు pic.twitter.com/KiNt9V7qaJ

— ArogyaAndhra (@ArogyaAndhra)

ఏపీ రాష్ట్రంలో ఇప్పటివరకు 2230 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రం ప్రకటించింది. 24 గంటల్లో చిత్తూరులో 4, గుంటూరులో 4, కర్నూల్ లో 3, నెల్లూరులో 1, ప్రకాశంలో 3,శ్రీకాకుళలంలో 7, విశాఖపట్టణంలో 3 కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో 2230కి చేరుకొన్నాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

also read:తెలంగాణపై కరోనా పంజా... ఒకే అపార్ట్ మెంట్ లో 23మందికి, మొత్తం 55 కేసులు

రాష్ట్రంలో 747 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు కరోనా వైరస్ సోకి 1433 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సోకి రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది మృతి చెందినట్టుగా ప్రభుత్వం తెలిపింది.

click me!