ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1555 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో 13 మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 23,814కి చేరుకొంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1555 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో 13 మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 23,814కి చేరుకొంది.
also read:ఉరవకొండ బస్టాండ్‌లో కలకలం: సొమ్మసిల్లిపడిపోయిన కరోనా రోగి
undefined
కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు 277 మంది మరణించారు. కరోనా సోకినవారిలో ఇప్పటివరకు 12,154 మంది కోలుకొన్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఇంకా 11,383 యాక్టివ్ కేసులు రికార్డైనట్టుగా ఏపీ హెల్త్ బులిటెన్ తెలిపింది.
: 09/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 21,071 పాజిటివ్ కేసు లకు గాను
*10,250 మంది డిశ్చార్జ్ కాగా
*277 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 10,544 pic.twitter.com/eqJU6sVkoJ
గత 24 గంటల్లో 16,882 మంది శాంపిల్స్ పరీక్షిస్తే 1555 మందికి కరోనా నిర్ధారణ అయిందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 10,94,615 మంది నుండి శాంపిల్స్ సేకరించారు. రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో 11,383 మంది కరోనా చికిత్స తీసుకొంటున్నారని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
గత 24 గంటల్లో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన 53 మందికి, విదేశాల నుండి వచ్చిన ఇద్దరికి కరోనా సోకిందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో కర్నూల్, గుంటూరు జిల్లాల్లో ముగ్గురి చొప్పున, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున కృష్ణా, పశ్చిమగోదావరి, చిత్తూరులలో ఒక్కరేసి చొప్పున మరణించారు.
కర్నూల్ జిల్లాలో 2795, అనంతపురంలో 2659, గుంటూరులో 2663, కృష్ణాలో 2095, తూర్పుగోదావరిలో2062 కరోనా కేసులు నమోదైనట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది.