పాదయాత్రలో ముద్దులు ఇప్పుడేమో గుద్దులు: జగన్ పై లోకేష్ సీరియస్

Published : Jul 09, 2020, 01:09 PM ISTUpdated : Jul 09, 2020, 01:10 PM IST
పాదయాత్రలో ముద్దులు ఇప్పుడేమో గుద్దులు: జగన్ పై లోకేష్ సీరియస్

సారాంశం

 టిడిపి ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను లాక్కోవాలని వైసిపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.

గుంటూరు:  టిడిపి ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను లాక్కోవాలని వైసిపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.  కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో నిరుపేదల గుడిసెలను తొలగించడంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

''పాదయాత్రలో ముద్దులు, ఇప్పుడు గుద్దులు.పేదల భూములు లాక్కొని పేదలకే అమ్మడం వైఎస్ జగన్ మార్క్ రివర్స్ టెండర్. టిడిపి హయాంలో నిరుపేదల కోసం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో నిర్మించుకున్న గుడిసెలను కూల్చివేయడం జగన్ గారి అహంకార ధోరణకి నిదర్శనం'' అని లోకేష్ మండిపడ్డారు. 
  
''మీకు ఉండటానికి విల్లాలు,  రాజప్రసాదాలు కావాలి పేదవాడికి గుడిసె వేసుకునే హక్కు కూడా లేదా?'' అంటూ ఎమ్మిగనూరులో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించడంపై లోకేష్ ట్విట్టర్ వేదికన సీరియస్ అయ్యారు. 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?