ఏపీలో కరోనా కేసులు తగ్గు ముఖం: మొత్తం కేసులు 20,72,725కి చేరిక

Published : Nov 29, 2021, 07:10 PM IST
ఏపీలో కరోనా కేసులు తగ్గు ముఖం: మొత్తం కేసులు 20,72,725కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టాయి. 24 గంటల్లో18,730  మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 101 మందికి కరోనా నిర్ధారణ అయింది.  రాష్ట్రంలో కరోనా కేసులు 20,72,725కి చేరుకొన్నాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో18,730  మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 101 మందికి కరోనా నిర్ధారణ అయింది.  రాష్ట్రంలో కరోనా కేసులు 20,72,725కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి  ఒక్కరు మరణించారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 14,439 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 138 మంది Corona నుంచి కోలుకొన్నారు. Andhra pradesh రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 20లక్షల 56వేల 184 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 2102 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 3,03,91,157 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

also read:Omicron: వేగంగా దేశాలు దాటుతున్న వేరియంట్.. ఆపడం సాధ్యమేనా? ఏయే దేశాలకు చేరిందంటే?

గత 24 గంటల్లో అనంతపురంలో005,చిత్తూరులో 019, తూర్పుగోదావరిలో014,గుంటూరులో012,కడపలో 008, కృష్ణాలో010, కర్నూల్ లో000, నెల్లూరులో009, ప్రకాశంలో 001,విశాఖపట్టణంలో 012,శ్రీకాకుళంలో010, విజయనగరంలో 000,పశ్చిమగోదావరిలో 001కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో కరోనాతో ఒక్కరు మరణించారు. కృష్ణా జిల్లాల్లో కరోనాతో ఒక్కరు చనిపోయినట్టుగా ప్రభుత్వం తెలిపింది..దీంతో రాష్ట్రంలో  కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,439కి చేరుకొంది.


ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,58,025 మరణాలు 1093
చిత్తూరు-2,47,984, మరణాలు1954
తూర్పుగోదావరి-2,94,665, మరణాలు 1290
గుంటూరు -1,78,850,మరణాలు 1250
కడప -1,15,871,మరణాలు 644
కృష్ణా -1,20,238,మరణాలు 1456
కర్నూల్ - 1,24,194,మరణాలు 854
నెల్లూరు -1,46,851,మరణాలు 1054
ప్రకాశం -1,38,694, మరణాలు 1129
శ్రీకాకుళం-1,23,430, మరణాలు 789
విశాఖపట్టణం -1,58,378, మరణాలు 1134
విజయనగరం -83,052 మరణాలు 672
పశ్చిమగోదావరి-1,79,598, మరణాలు 1120

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?