ఆయనవి బురద రాజకీయాలు: చంద్రబాబుకు జగన్ కౌంటర్

Published : Nov 29, 2021, 04:03 PM ISTUpdated : Nov 29, 2021, 04:12 PM IST
ఆయనవి బురద రాజకీయాలు: చంద్రబాబుకు జగన్ కౌంటర్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొన్న భారీ వర్షాల కారణంగా బాధితులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకొందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఇవాళ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. 

అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్   విమర్శించారు. వరద సహాయంపై చంద్రబాబు  చేసిన విమర్శలపై ఏపీ సీఎం జగన్ కౌంటరిచ్చారు.  వరద సహాయంపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన విమర్శలకు ఆయన ధీటుగా బదులిచ్చారు. తాము రేషన్, నిత్యావసరాలతో పాటు రూ. 2 వేలు అదనపు సహాయం  చేశామన్నారు. నష్టపోయిన  Farmers ఎన్యూమరేషన్ పూర్తి చేసి సహాయం అందిస్తున్నామని చెప్పారు.  గతంలో ఇన్‌పుట్ సబ్సిడీ అందాలంటే కనీసం ఏడాది పట్టేదన్నారు. Crop నష్టపోయిన సీజన్ ముగిసేలోపుగా  తమ ప్రభుత్వం సబ్సిడీని అందిస్తుందని సీఎం Ys Jagan చెప్పారు. పునరావాస కేంద్రాలను తెరిచి వరద బాధితులను ఆదుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  ఉదారంగా, మానవతా థృక్పథంలో స్పందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

also read:ఏపీలో సోమ, మంగళవారాల్లో అతి భారీ వర్షాలు... ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక, స్కూళ్లకు సెలవు

Flood ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు ఇంతటి శరవేగంగా చర్యలను తీసుకోవడం అన్నది గతంలో ఎన్నడూ జరగలేదన్నారు.గతంలో కనీసం నెల పట్టేదన్నారు. తమ ప్రభుత్వం వారంరోజుల్లోనే బాధితులకు సహాయాన్ని అందిస్తుందన్నారు. బాధిత కుటుంబాలకు అన్నిరకాలుగా నష్టపరిహారాన్ని అందించామన్నారు. దురదృష్టవశాత్తూ ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి పరిహారం ఇవ్వాలంటే నెలరోజులు పట్టేదని ఆయన గుర్తు చేశారు.గతంలో గల్లైంతైన వారికి ఎలాంటి పరిహారం ఇచ్చేవారు కాదన్నారు. అలాంటిది ఇవాళ వారంరోజుల్లో ఆయా కుటుంబాలకు పరిహారం ఇచ్చి వారిని అదుకున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం నిత్యావసరాలతో పాటు  రూ.2వేల రూపాయలు అదనపు సహాయం కూడా ఇచ్చామని సీఎం వివరించారు. సీజన్‌ ముగిసేలోగా నష్టపోయిన రైతులకు సహాయం చేసిన దాఖలాలు లేవన్నారు.

నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్‌ పూర్తిచేసి సీజన్‌లోగా వారికి సహాయం అందిస్తున్నామని ఆయన తెలిపారు. గతంలో ఇన్‌పుట్‌సబ్సిడీ అందాలంటే కనీసం సంవత్సరం పట్టేది. ఆ తర్వాత కూడా ఇచ్చిన దాఖలాలు లేవని జగన్ విమర్శించారు. ఇవాళ పంట నష్టపోయిన సీజన్‌ ముగిసేలోగానే అందిస్తున్నామని ఆయన తెలిపారు.రూ.6వేల కోట్లు నష్టం జరిగితే ... ఇచ్చింది రూ.34 కోట్లే అని విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శలను ఆయన ప్రస్తావించారు. హుద్‌హుద్‌లో రూ.22వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పిన చంద్రబాబు సర్కార్ రూ.550 కోట్లే ఇచ్చిందన్నారు.

పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ పూర్తి కాగానే వెంటనే సోషల్‌ఆడిట్‌ కూడా నిర్వహించాలని సీఎం కోరారు. పూర్తిగా ధ్వసంమైన ఇళ్ల స్థానే కొత్త ఇళ్లను మంజూరు చేసి వెంటనే పనులుకూడా మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఇళ్లు లేని కారణంగా వారికి తాత్కాలిక వసతి ఏర్పాటు చేయాలన్నారు.  వాటిలో కనీస సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. తాగునీటి వసతుల పునరుద్ధరణపై కేంద్రీకరించాలని సీఎం కోరారు.అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో నీటిని నిల్వచేయలేని పరిస్థితి నెలకొందన్నారు.అలాగే చాలాచోట్ల తాగునీటి సరఫరాకు ఆధారమైన చెరువులుకూడా గండ్లు పడిన విషయమై  సీఎం గుర్తు చేశారు. వచ్చే వేసవిని కూడా దృష్టిలో ఉంచుకుని బలమైన ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో Heavy Rains  తీవ్రంగా నష్టం వాటిల్లింది.  
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?