టీడీపీ నేత తిక్కారెడ్డికి భద్రత కల్పించాలి:ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కి చంద్రబాబు లేఖ

Published : Dec 12, 2021, 09:47 AM IST
టీడీపీ నేత తిక్కారెడ్డికి భద్రత కల్పించాలి:ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కి చంద్రబాబు లేఖ

సారాంశం

ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆదివారం నాడు లేఖ రాశారు. టీడీపీ నేత తిక్కారెడ్డిపై దాడికి దిగిన  వైసీపీ నేతలపై చర్యలు తీసకోవాలని ఆ లేఖలో చంద్రబాబు డీజీపీని డిమాండ్ చేశారు. 

అమరావతి: టీడీపీ నేత తిక్కారెడ్డిపై దాడికి దిగిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ  Gautam sawang  టీడీపీ చీఫ్ Chandrababu Naidu ఆదివారం నాడు లేఖ రాశారు.కర్నూల్ జిల్లా కోసిగి మండలంలో పార్టీ నేత Tikka reddyపై దాడి ఘటనలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బొంపల్లెలో ఆలయానికి వెళ్లిన తిక్కారెడ్డిపై ycp గుండాలు దాడి చేశారని Tdp  ఆరోపిస్తోంది.ఈ దాడిలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారని చంద్రబాబునాయుడు ఆ లేఖలో పేర్కొన్నారు.  రాష్ట్రంలో వైసీపీ మూకలను అడ్డుకోవడంలో పోలీసులు విఫలం అవుతున్నారని ఆయన విమర్శించారు. తిక్కారెడ్డిపై దాడికి దిగిన వైసీపీ శ్రేణులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు తిక్కారెడ్డికి తగిన భద్రత కల్పించాలని letterలో చంద్రబాబు డీజీపీని కోరారు.

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలు, నేతలను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహిస్తున్నారని టీడీపీ ఆరోపించింది. తమ పార్టీకి చెందిన ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకొని కూడా వైసీపీ అక్రమ కేసులు బనాయిస్తోందని టీడీపీ చీఫ్ చంద్రబాబు గతంలో పలుమార్లు ఆరోపించారు. పోలీసుల తీరును ఆయన తప్పుబట్టారు. తాము వైసీపీ నేతలపై ఇచ్చిన ఫిర్యాదుకు  సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేయలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరును కూడా చంద్రబాబు పలు మార్లు బహిరంగంగానే విమర్శించారు. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించిన తీరుపై  తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యూడిషీయల్ కమిషన్ ను ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం