Andhra pradesh: మహిళల ఆరోగ్య భద్రతకు ప్రాజెక్ట్ ఆరోగ్య భరోసా.. మీనాక్షి ఎన‌ర్జీ ఉచిత వైద్య శిబిరం

Published : Jul 14, 2026, 05:19 PM IST
Andhra pradesh

సారాంశం

Andhra pradesh: సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ మరో కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. సంస్థ అమలు చేస్తున్న 'ప్రాజెక్ట్ ఆరోగ్య' కింద నెల్లూరు జిల్లా తమ్మినపట్నం పంచాయతీలో మహిళల కోసం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించింది.

100 మందికిపైగా మహిళలకు ఉచిత వైద్య సేవలు

నెల్లూరులోని జయభారతి హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో మహిళల ఆరోగ్యానికి సంబంధించిన పలు పరీక్షలు చేపట్టారు. ముఖ్యంగా ప్రజనన మార్గ సంక్రమణలు (RTIs), రక్తహీనత (అనీమియా), ఇతర స్త్రీరోగ సమస్యలను గుర్తించేందుకు వైద్యులు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. రోజంతా సాగిన ఈ ఆరోగ్య శిబిరంలో 100 మందికిపైగా మహిళలు పాల్గొని వైద్య సేవలను పొందారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు, ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వ్యక్తిగత సలహాలను కూడా వైద్య నిపుణులు అందించారు.

నిపుణుల వైద్య బృందం సేవలు.. నివారణాత్మక ఆరోగ్యంపై అవగాహన

జయభారతి హాస్పిటల్‌కు చెందిన గైనకాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్లు పాల్గొన్న వైద్య బృందం ప్రతి మహిళకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. వ్యాధులు తీవ్రమయ్యే వరకు వేచి చూడకుండా, ప్రారంభ లక్షణాలు కనిపించినప్పుడే వైద్యులను సంప్రదించాలని మహిళలకు సూచించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ముందుగానే నివారించవచ్చని వివరించారు. గ్రామీణ ప్రాంత మహిళల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడం కూడా ఈ కార్యక్రమంలో కీలక భాగంగా నిలిచింది.

మహిళల ఆరోగ్యం సమాజాభివృద్ధికి పునాది: వేదాంత పవర్ సీఈఓ

ఈ సందర్భంగా వేదాంత పవర్ లిమిటెడ్ సీఈఓ రాజిందర్ సింగ్ ఆహుజా మాట్లాడుతూ, సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్న ప్రాంతాల్లో సమాజ సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా మహిళల ఆరోగ్యం బలంగా ఉంటే కుటుంబం, సమాజం, దేశ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్ట్ ఆరోగ్య ద్వారా నివారణాత్మక వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు చేరవేయడం, ఆరోగ్యంపై అవగాహన పెంచడం, సకాలంలో వైద్య సహాయం అందుబాటులోకి తీసుకురావడం సంస్థ లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సామాజిక బాధ్యత కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించారు. అదే కార్యక్రమాన్ని వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ సీఈఓ కె.బి. బిను రాఫెల్ ప్రారంభించారు. మహిళలతో నేరుగా మాట్లాడిన ఆయన, ప్రతి మహిళ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం అని సూచించారు. కుటుంబాల్లో ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వివరించారు.

ABHA కార్డుల నమోదు.. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఆరోగ్య సేవలకు ప్రోత్సాహం

ప్రాజెక్ట్ ఆరోగ్యలో భాగంగా వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ పరిసర గ్రామాల్లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA) కార్డుల నమోదును కూడా కొనసాగిస్తోంది. ఈ నమోదు ద్వారా ప్రతి వ్యక్తికి ప్రత్యేక డిజిటల్ హెల్త్ ఐడీ లభిస్తుంది. దీని సహాయంతో దేశవ్యాప్తంగా అనుసంధానమైన ఆరోగ్య సంస్థల్లో వైద్య రికార్డులను సులభంగా వినియోగించుకోవడంతో పాటు చికిత్స పొందడం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.

ఇప్పటివరకు 150 మందికిపైగా గ్రామీణ ప్రజలు ఈ నమోదు కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందినట్లు సంస్థ తెలిపింది. అకాడమీ ఆఫ్ గాంధియన్ స్టడీస్ (AGS) భాగస్వామ్యంతో అమలవుతున్న ప్రాజెక్ట్ ఆరోగ్య ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల అవ‌స‌రాన్ని విస్తరించడమే కాకుండా, డిజిటల్ ఆరోగ్య వ్యవస్థపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా కూడా సంస్థ ముందుకు సాగుతోంది. గ్రామ ప్రజలు, స్థానిక ప్రతినిధులు, భాగస్వామ్య సంస్థల సహకారంతో ఈ వైద్య శిబిరం విజయవంతంగా పూర్తయింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ప్రతీ బాధిత కుటుంబానికి కోటి ఇవ్వాలి జగన్ డిమాండ్| YS Jagan Visits Visakhapatnam to Console Families
మాన‌వ‌త్వం లేని ప్ర‌భుత్వం ఉండేది ఇంకా మూడేళ్లే:జగన్ | YS Jagan Visits Visakhapatnam