Andhra Pradesh: నిత్య పెళ్లికొడుకు.. 100 మందిని చీట్ చేసిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి.. చివ‌రకు..?

Published : Feb 18, 2022, 10:39 AM ISTUpdated : Feb 18, 2022, 10:40 AM IST
Andhra Pradesh: నిత్య పెళ్లికొడుకు.. 100 మందిని చీట్ చేసిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి.. చివ‌రకు..?

సారాంశం

Andhra Pradesh: మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేసి.. మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా కనీసం 100 మంది మహిళలను మోసగించాడు ఓ ప్ర‌బుద్దుడు. నిందితుడు మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లలో నకిలీ ప్రొఫైల్‌లు సృష్టించి, ధనిక నేపథ్యం ఉన్న మహిళలను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మోసానికి పాల్ప‌డుతున్న ఈ మాజీ ప్ర‌భుత్వ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Andhra Pradesh: ఇటీవ‌లి కాలంలో మ్యాట్రిమోనియ‌ల్ సైట్ల (matrimonial sites) ద్వారా మోస‌పోతున్న దానికి సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. బాధితుల్లో మ‌హిళ‌ల‌తో పాటు పురుషులు కూడా అధికంగా ఉంటున్నారు. పెండ్లి చేసుకుంటాన‌ని చెప్పి.. వారి వ‌ద్ద నుంచి ల‌క్ష‌ల రూపాయ‌లు కొల్ల‌గొట్టి మోసానికి పాల్ప‌డుతున్నారు. ఇదే త‌ర‌హాలో మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకుంది. పెండ్లి చేసుకుంటాన‌ని చెప్పి ఓ ప్ర‌బుద్దులు ఏకంగా 100 మహిళ‌ల‌ను మోసం చేశాడు. వారి నుంచి డ‌బ్బును కొల్ల‌గొట్టాడు. నిందితుడు మాజీ ప్ర‌భుత్వ ఉద్యోగిగా గుర్తించిన పోలీసులు.. కేసు న‌మోదుచేసి.. అదుపులోకి తీసుకున్నారు. 

పోలీసులు (police ) తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మ్యాట్రిమోనియల్ సైట్ల (matrimonial sites) ద్వారా ధ‌నిక అమ్మాయిల‌ను టార్గెట్ చేసి.. వారిని పెండ్లి చేసుకుంటాన‌నీ, మోసం చేసి వారిని డ‌బ్బును కొల్ల‌గొడుతున్న నిందితుడిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసుకునీ, ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. మ్యాట్రిమోనియ‌ల్ సైట్ల ద్వార మోసానికి పాల్ప‌డుతున్నఈ ప్రభుత్వ మాజీ ఉద్యోగిని చిత్తూరు రెండో ప‌ట్ట‌ణ పోలీసులు ( Chittoor II town police) అరెస్టు చేశారు. నిందితుగిని త‌మిళ‌నాడు (Tamil Nadu).. చెందిన కరణం రెడ్డి ప్రసాద్‌గా గుర్తించారు. 

 డీఎస్పీ ఎన్.సుధాకర్ రెడ్డి (DSP N Sudhakar Reddy) మాట్లాడుతూ.. నిందితులు మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లలో నకిలీ ప్రొఫైల్‌లు సృష్టించి, ధనిక నేపథ్యం ఉన్న మహిళలను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి..వారిని ఆక‌ర్షించేవాడు.   తాను చిత్తూరులోని పశుసంవర్ధక శాఖ (animal husbandry department in Chittoor)లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నానని, బాధితులతో పరిచయం ఏర్ప‌ర్చుకునే వాడు. వారిని ఆక‌ర్షించి.. ప‌రిచ‌యం మ‌రింత బ‌లంగా మారిన‌ తర్వాత సుమారు 25 వేల రూపాయల రుణం ఇప్పిస్తానని చెప్పి మాయమయ్యాడని.. ఇప్పటివరకు కనీసం 100 మంది మహిళలను మోసం చేశాడని తెలిపారు. నిందితుడు త‌మిళ‌నాడు(Tamil Nadu)-అరక్కోణం(Arakkonam) లోని కసిరాల (Kasirala village)  గ్రామానికి చెందినవాడ‌ని తెలిపారు. 

బాధితుల్లో ఒకరు చిత్తూరులోని పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న అసలైన డిప్యూటీ డైరెక్టర్‌ ఎం ప్రభాకర్‌ను సంప్రదించగా విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. మ్యాట్రిమోనియ‌ల్ సైట్ల లో క‌నిపించే ప్రొఫైల్ వ్య‌క్తుల ప‌ట్ల అప్ర‌మ‌త్త‌గా అవ‌స‌ర‌మ‌ని పోలీసులు ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నారు. 

ఇదిలావుండగా, ఒడిశాకు చెందిన 66 ఏళ్ల వ్యక్తి 40 యేళ్ల వ్యవధిలో Seven statesలో మధ్య వయస్కులు, విద్యావంతులైన 14 మంది మహిళలను Marriage చేసుకున్న సంగతి తెలిసిందే. అతన్ని సోమవారం పోలీసులు arrest చేశారు. కాగా ఈ కేసులో అతని భార్యల సంఖ్య మరో మూడుకు పెరిగిందని తాజాగా బుధవారం పోలీసు అధికారులు తెలిపారు. డాక్టర్ అని Duplicate identityతో మహిళలను పరిచయం చేసుకుని.. వారితో ప్రేమాయణం నడిపి పెళ్లిళ్లు చేసుకున్నాడు. తాజాగా బయటపడ్డ భార్యల లిస్టులోఛత్తీస్‌గఢ్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్, అస్సాంకు చెందిన వైద్యురాలు, ఒడిశాకు చెందిన ఉన్నత విద్యావంతురాలైన మహిళ కూడా ఉన్నారని పోలీసు అధికారి తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu