బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం.. ఇద్దరు యువకుల అరెస్ట్...

Published : Feb 18, 2022, 07:13 AM IST
బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం.. ఇద్దరు యువకుల అరెస్ట్...

సారాంశం

ఓ బాలికతో పరిచయం పెంచుకున్న యువకులు ఆమె మీద కన్నేశారు. మాయమాటలు చెప్పి నమ్మబలికి... తమతో తీసుకెళ్లారు. ఆ తరువాత ఆ చిన్నారిమీద అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరు యువకుల్ని అరెస్ట్ చేశారు. 

గాజువాక : మాయమాటలతో బాలికను లోబరుచుకుని molestation చేసిన ఘటన లో ఇద్దరు యువకులను పెద్ద గంట్యాడ దరి న్యూపోర్ట్ పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సిఐ ఎస్. రాము చెప్పిన వివరాల మేరకు… Gajuwaka సమీప గంగవరం గ్రామానికి చెందిన ఏం. రాజు (27), పెదగంట్యాడ సిద్దేశ్వరం కాలనీలో నివాసం ఉంటూ, ఐటిఐ చదువుతున్న గణేష్ (19) స్నేహితులు. వీరిద్దరూ పెదగంట్యాడలో 9వ తరగతి చదువుతున్న బాలిక (14)తో చనువుగా ఉండేవారు. 

ముగ్గురు బుధవారం రాత్రి Pedagantyada Theerthamలో కలిశారు. యువకులు ఇద్దరు బాలికను మాయ మాటల్లో పెట్టి తన ద్విచక్రవాహనంపై Yarada hillపైకి తీసుకెళ్లారు. అక్కడే పాడుబడిన షెడ్ లో మద్యం తాగిన యువకులు బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. రాజు బాలికపై rapeకి ఒడిగట్టగా.. గణేష్ దానికి సహకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో బాలిక తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తే ఎంతకీ తీయకపోవడంతో... డయల్ 100కు కాల్ చేసింది.

రాత్రి గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు బాలికను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళారు. నిందితులిద్దిర మీద పోక్సో, అత్యాచారం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కేసును దిశ పోలీస్ స్టేషన్ కు బదలాయించి.. నిందితులను అక్కడికి తరలించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్ కు తీసుకెళ్లారు. న్యూపోర్ట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా, విజయనగరం జిల్లాలో మరో దారుణం ఘటన చోటు చేసుకుంది. అభం.. శుభం తెలియని ఆ చిన్నారిని చూస్తే మురిపం కలగాల్సింది పోయి.. ఈ కర్కశుడిలో మృగత్వం మేల్కోంది...విచక్షణ మరికి ప్రవర్తించాడు. కన్నకూతురిలా  చూసుకోవాల్సినవాడే రాక్షసుడిలా మారాడు.. 2 years old చిన్నారికి నరకం చూపించాడు..

తన lover 2 ఏళ్ల daughterను ఏడు నెలలుగా Tortureకు గురి చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... విజయనగరం కొత్తకోట సమీపంలో ఉన్న 26 ఏళ్ల Married womanను భర్త వదిలేశాడు. ఆమెకు రెండేళ్ల చిన్నారి ఉంది. కూలి పనులు చేసుకుని బతుకుతుంది. ఈ క్రమంలో నెల్లిమర్లలో ఓ శుభకార్యంలో ఆమెకు ఓప్రైవేట్ ఎలక్ట్రీషియన్ చిన్నా (29)తో పరిచయం ఏర్పడింది. అది Symbiosisకి దారితీసింది. ఇద్దరూ ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

అప్పటినుంచి చిన్నా కన్ను.. ఆమె రెండేళ్ల కూతురి మీద పడింది.. ఏడు నెలలుగా బాలికను కొట్టడం, రక్కడం వంటి వికృత చేతులకు చిన్నా పాల్పడుతున్నా ఆమె అడ్డు చెప్పలేదు. కానీ, బుధవారం రాత్రి తల్లి ఇంట్లో లేనప్పుడు పాప బుగ్గలు, కాళ్లు, చేతులను చిన్నా కొరికేసాడు. ఆమె ఇంటికి వచ్చేసరికి పాప ఏడుస్తుంది. చుట్టుపక్కలవారు ఏమైంది.. అని అడిగితే విషయాన్ని దాటవేసింది. అంగన్వాడి సిబ్బందికి విషయం తెలియడంతో స్థానిక మహిళా సంరక్షణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లి ఫిర్యాదు మేరకు చిన్నాను రిమాండ్ కు తరలించారు దిశ డీఎస్పీ టి. త్రినాథ్ తెలిపారు. బాలికను వైద్య చికిత్సలకు ఆసుపత్రికి తరలించామని, తల్లికి వ్యక్తిత్వ, మానసిక నిపుణుల వద్ద కౌన్సెలింగ్ చేయిస్తామని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

ధవళేశ్వరం బ్యారేజ్ పరిశీలించిన సీఎం చంద్రబాబు | Sir Arthur Cotton Barrage Gate Renovation
పిచ్చుకులంకలో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | CM Chandrababu Naidu Speech at Dowleswaram Barrage