
హైదరాబాద్‌లో వున్న ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తను (ap lokayukta) కర్నూలుకు (kurnool) తరలించారు. దీంతో రేపటి నుంచి కర్నూలు నుంచే ఏపీ లోకాయుక్త కార్యకలాపాలు కొనసాగనున్నాయి. కాగా.. ఇప్పటికే కర్నూలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ ప్రధాన కార్యాలయాన్ని (aphrc) ఏర్పాటు చేశారు. గతంలో ఏపీ హెచ్ఆర్సీ హైదరాబాద్‌లో వుండేది. అలాగే లోకాయుక్త, ఉప లోకాయుక్త కార్యాలయాలను కూడా కర్నూలులో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యూనల్‌ను కూడా కర్నూలులోనే ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. లోకాయుక్త తరలింపుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.