అనంతపురం ఆసుపత్రిలో మరణాలపై రిపోర్ట్ ఇవ్వండి: కరోనాపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published May 6, 2021, 2:30 PM IST
Highlights

అనంతపురం ఆసుపత్రిలో కరోనా మరణాలపై రిపోర్టు ఇవ్వాలని ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని గురువారం నాడు ఆదేశించింది. 

హైదరాబాద్: అనంతపురం ఆసుపత్రిలో కరోనా మరణాలపై రిపోర్టు ఇవ్వాలని ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని గురువారం నాడు ఆదేశించింది. కరోనా కేసులపై ఏపీ హైకోర్టు గురువారం నాడు విచారణ నిర్వహించింది. సామాజిక కార్యకర్త సురేష్, ఏపీసీఎల్సీ దాఖలు చేసిన పిటిషన్‌ పై  ఏపీ హైకోర్టులో  గురువారం నాడు విచారణ జరిగింది.  కోవిడ్ కేర్ సెంటర్లు, బెడ్లు పెంచాలని  ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వ్యాక్సినేషన్ పై కూడ ఉన్నత న్యాయస్థానం ఆరా తీసింది.ఆక్సిజన్ స్వయం సమృద్దికి ఎలాంటి చర్యలు తీసుకొన్నారని  హైకోర్టు ప్రశ్నించింది. 

also read:కరోనా కట్టడి : జగన్ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.


ఏపీ ప్రభుత్వం కోరిన ఆక్సిజన్ ను సరఫరా చేయాలని ఏపీ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.  దూరప్రాంతాల నుండి కాకుండా బళ్లారి, తమిళనాడు  నుండి ఆక్సిజన్ ను సరఫరా చేయాలని కేంద్రానికి హైకోర్టు సూచించింది. కరోనా టెస్టులు పెంచేందుకు ఆసుపత్రుల్లో సౌకర్యాలను పెంచాలని కోరింది. 45 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్  ఎప్పుడు అందిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. 
 

click me!