ధూళిపాళ్ల బెయిల్ పిటిషన్ పై రేపు తీర్పు: పోలీస్ కస్టడీ పొడగింపునకు కోర్టు నో

Published : May 06, 2021, 01:05 PM ISTUpdated : May 06, 2021, 01:23 PM IST
ధూళిపాళ్ల బెయిల్ పిటిషన్ పై రేపు తీర్పు: పోలీస్ కస్టడీ పొడగింపునకు కోర్టు నో

సారాంశం

పొన్నూరు మాజీ ఎమ్మెల్యే  ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పిటిషన్ పై శుక్రవారం నాడు తీర్పు వెల్లడిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది.   

అమరావతి:పొన్నూరు మాజీ ఎమ్మెల్యే  ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పిటిషన్ పై శుక్రవారం నాడు తీర్పు వెల్లడిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో గురువారం నాడు విచారణ నిర్వహించింది. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ బెయిల్ పిటిషన్ పై విచారణకు సిద్దమన్న ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు. అయితే  తమకు  వారం రోజులు సమయం కావాలని ఏసీబీ ఏపిపి కోరారు.  అయితే ఈ వాదనను  ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. 

also read:ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్: ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు

ముద్దాయిలు ఆసుపత్రిలో ఉన్న కారణంగా కస్టోడియల్ ఇంటరాగేషన్ పూర్తి చేయలేక పోయినట్టుగా ఏసీబీ తరపు న్యాయవాది తెలిపారు. ఈ కారణంగా  బెయిలు ఇవ్వరాదని న్యాయమూర్తి ని  ఏపిపి కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపటి వరకు అనగా 7 మే 2021 వరకు ఇచ్చిన కస్టడీ గడువు పొడిగించబోనని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తేల్చి చెప్పారు.

హైకోర్టు ఉత్తర్వుల మేరకు బెయిల్ పిటిషన్లను డిస్పోస్ చేయవలసి ఉన్నందున ఎట్టి పరిస్థితులలో ఆర్గ్యుమెంట్ చెప్పవలసినదేనని ఏసీబీ ఏపీపీకి న్యాయమూర్తి తేల్చిచెప్పారు.ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఏసీబీ  వాదనలను వినిపిస్తానన్న ఏపీపీ హైకోర్టుకు తెలిపారు.వాదనలు విన్న తర్వాత  ఈ నెల 7న బెయిల్ పిటిషన్ పై  తీర్పు చెప్తానని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!