YS Jagan Mohan Reddy పై సీబీఐ విచారణ కోరుతూ రఘురామ పిటిషన్: సీఎం సహా 41 మందికి నోటీసులు

By narsimha lodeFirst Published Nov 23, 2023, 12:25 PM IST
Highlights

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీ  రఘురామ కృష్ణంరాజు  ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది.  

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత  చేపట్టిన కార్యక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ) ఎంపీ  రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన  పిటిషన్ పై  ప్రతి వాదులకు  నోటీసులు జారీ చేయాలని  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారంనాడు నోటీసులు జారీ చేసింది.ఈ పిటిషన్ పై విచారణను ఈ ఏడాది డిసెంబర్  14 వ తేదీకి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై వైఎస్ఆర్‌సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  జగన్ సీఎం అయ్యాక  చేసిన పనులపై సీబీఐ విచారణ కోరారు.  ఈ పిటిషన్ పై  విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది హైకోర్టు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్ధిక అవకతవకలు జరిగాయని రఘురామ కృష్ణంరాజు  ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ ఆర్ధిక అవకతవకలపై  సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన  కోరారు.ఈ పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గురువారంనాడు విచారణ జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు,అధికారులకు  నోటీసులు జారీ చేయాలని ఆంధప్రదేశ్ హైకోర్టు  ఆదేశాలు జారీ చేసింది.

ప్రజా ప్రయోజనం లేకుండా వ్యక్తిగత ఉద్దేశ్యంతోనే  ఈ పిటిషన్ వేశారని  అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ఏపీ హైకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు విన్పించారు.ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని  అడ్వకేట్ జనరల్ శ్రీరామ్  ఏపీ హైకోర్టులో తన వాదనలు విన్పించారు. ఈ పిటిషన్ ను కొట్టివేయాలని హైకోర్టును కోరారు  ఏజీ శ్రీరామ్.  పిటిషనర్ తరపున మురళీధర్  ఏపీ హైకోర్టులో వాదనలు విన్పించారు.  ఈ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత  ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని హైకోర్టు దృష్టికి తెచ్చారు

also read:Pawan Kalyan: తెలంగాణ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ లో రౌడీలతో పోరాటం

.అయితే తొలుత ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాల మేరకు సీఎం జగన్ సహా 41 మందికి నోటీసులు జారీ చేశారు. ఈ పిటిషన్ పై వచ్చే నెల  14వ తేదీన విచారణ నిర్వహించనున్నట్టుగా ఏపీ హైకోర్టు తెలిపింది.

click me!