Covid EX-gratia కోసం కొత్త Portal ప్రారంభించిన‌ ఏపీ స‌ర్కార్

Published : Dec 19, 2021, 01:18 PM IST
Covid  EX-gratia కోసం కొత్త Portal ప్రారంభించిన‌ ఏపీ స‌ర్కార్

సారాంశం

Covid  EX-gratia: కరోనా మ‌హ‌మ్మారికి బ‌లైన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సాయం నేరుగా బాధిత కుటుంబాలకే చేరే విధంగా ఓ పోర్టల్ తీసుకొచ్చింది.  కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు రూ. 50 వేలు పరిహారం చెల్లించడానికి ఆన్ లైన్ పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ మేర‌కు రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి. ఉషారాణి నోటిఫికేషన్ విడుదల చేశారు.    

Covid Compensation Portal :  రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా మహమ్మారి ఎంత‌టీ విల‌య‌తాండ‌వం సృష్టించిందో అంద‌రికీ తెలుసు. ఈ మ‌హామ్మారికి  ఎంతో మంది బ‌లయ్యారు. ఈ క్ర‌మంలో ఆర్థికంగానే కాదు. ఒక త‌రం అంత‌రించిపోతుందా అనేలా.. బీభ‌త్సం సృష్టించింది. భవిష్యత్ తరాలపై ఎంతో ప్రభావం చూపించింది. ఎన్నో కుటుంబాలు శోక సంద్రంలో మునిగాయి. ఎంతో మంది జీవితాలు అస్త‌వ్య‌స్త‌మ‌య్యాయి. ఎంతోమంది జీవ‌న విధానం విచ్ఛిన్నమైంది. ఈ క్ర‌మంలో అనేక మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. ముఖ్యంగా కుటుంబానికి ఆసరాగా నిలబడే అండను పోగొట్టుకుని ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. 

ఈ నేపథ్యంలో కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ కారణంగా మరణించిన మృతుల కుటుంబ సభ్యులకు రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా బాధిత కుటుంబాల‌కు రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా (నష్టపరిహారం) ను ఆన్‌లైన్‌ పోర్టల్ ద్వారా అందించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకోంది. ఈ మేర‌కు రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి నోటిఫికేషన్‌ను జారీ చేశారు. 

Read Also: అలా చేస్తే.. శాశ్వతంగా రాజకీయాలకు దూర‌మ‌వుతా.. Paritala Sriram సంచలన వ్యాఖ్యలు

కరోనా బాధిత కుటుంబాలకు సులభంగా, సాధ్యమైనంత త్వరగా డబ్బు అందించాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలిపారు. ఈ పోర్ట‌ల్ తో కేంద్ర, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలు సమన్వయంతో వ్యవహరించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. బాధితులు http://covid19.ap.gov.in/exgratia పోర్టల్‌లో నష్టరిహారం కోసం దరఖాస్తు చేసుకోవ‌చ్చ‌నీ, మొబైల్ తోపాటు కంప్యూటర్‌లోనూ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ క్ర‌మంలో మృతుడికి సంబంధించిన ఆర్‌టిపిసిఆర్‌, ర్యాపిడ్‌ యాంటిజెన్‌ లేదా మాలిక్యులర్‌ టెస్ట్‌ రిపోర్టులలో ఏదొక డాక్యుమెంట్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది.

Read Also: 65 ఏళ్లు.. 43 పుష్ అప్‌లు.. కాలేజీ ఫెస్ట్‌లో బీజేపీ నేత కైలాస్ విజయవర్గీయ హల్‌చల్

డాక్యుమెంట్‌ను పరిశీలించిన అనంతరం అధికారులు బాధితుల ఖాతాలోకి డబ్బు జమచేస్తారని పేర్కొన్నారు. నగదు పంపిణీలో అవకతవకలు జరగకూడదనే ఈ పోర్టల్ తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ లెక్కల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వలన ఇప్పటి వరకూ 14,478 మంది మరణించినట్లు తెలుస్తోంది. నెల రోజులలో 55 కొత్త మరణాలు సంభించినట్లు పేర్కొంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటలలో31,855 శ్యాంపిల్స్‌ను పరీక్షించగా, కొత్తగా 137 మందికి కోవిడ్‌ సోకినట్లు తెలిపింది. కరోనా నుంచి 189 మంది కోలుకోగా, 1,705 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్