ఏపీ బడ్జెట్ 2019: ఓట్ల కోసం తాయిలాలు

By narsimha lodeFirst Published Feb 5, 2019, 2:52 PM IST
Highlights

: త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఏపీ సర్కార్ తాయిలాలను ప్రకటించింది. కొత్త పథకాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా ఉద్యోగులకు, రైతులకు, మహిళ సంఘాలకు వరాలను ఇచ్చింది. కాపులకు బడ్జెట్‌లో పెద్దపీట వేసింది.

అమరావతి: త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఏపీ సర్కార్ తాయిలాలను ప్రకటించింది. కొత్త పథకాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా ఉద్యోగులకు, రైతులకు, మహిళ సంఘాలకు వరాలను ఇచ్చింది. కాపులకు బడ్జెట్‌లో పెద్దపీట వేసింది.

ఈ నెల మూడో వారం లేదా వచ్చే నెలలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్  వెలువడే అవకాశం ఉంది. ఈ తరుణంలో ప్రజలను ఆకట్టుకొనేలా సర్కార్ ఇటీవలనే పథకాలను ప్రవేశ పెట్టింది. గతంలో ప్రకటించిన పథకాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు.

రైతులకు పెట్టుబడి కోసం అన్నదాత సుఖీభవ పేరుతో కొత్త పథకాన్ని ఏపీ సర్కార్ ప్రకటించింది. మంగళవారం నాడు ఏపీ  ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు.

అన్నదాత సుఖీభవ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్లను కేటాయించింది. రైతులకు పెట్టుబడి కోసం ఈ పథకం కింద నిధులను అందించనున్నారు.  మరో వైపు  నిరుద్యోగ భృతిని వెయ్యి రూపాయాల నుండి రెండువేల రూపాయాలకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. ముఖ్యమంత్రి యువనేస్తం కింద ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఈ పథకానికి రూ.1200 కోట్లను  బడ్జెట్‌‌లో ప్రతిపాదించారు. 

బీసీల్లోని  అన్ని కులాలకు కార్పోరేషన్లను ఏర్పాటు చేశారు.  గతంలో ఉన్న ఫెడరేషన్లను కూడ ఫైనాన్స్ కార్పోరేషన్లుగా మార్చుతూ నిర్ణయం తీసుకొన్నారు. మరో వైపు కాపు కార్పోరేషన్‌కు వెయ్యి కోట్లను కేటాయించారు. ఈ మేరకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఈ ప్రతిపాదనలు చేశారు.

మరో వైపు బీసీల కోసం రూ. 3 వేల కోట్లను బడ్జెట్‌లో ఏపీ సర్కార్ ప్రకటించారు. డ్రైవర్స్ సాధికారిక  సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు రూ.150 కోట్లను కేటాయించారు. 

బీసీలతో పాటు అగ్రవర్ణాలకు కూడ కార్పోరేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఆ కార్పోరేషన్లకు   నిధులను  కేటాయించారు. బ్రహ్మణ కార్పోరేషన్‌కు రూ.100 కోట్లు, ఆర్యవైశ్య కార్పోరేషన్‌కు రూ. 50 కోట్లు కేటాయించింది.

మరోవైపు ఉద్యోగులకు కూడ పెద్ద ఎత్తున వరాలను కురిపించింది. రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ ఉద్యోగుల పాత్రను మరువలేమని మంత్రి యనమల తన బడ్జెట్ ప్రసంగంలో కొనియాడారు.కొత్త పెన్షన్ స్కీమ్‌‌లో మార్పులకు కమిటీ ఏర్పాటు చేసింది. 70 ఏళ్లు దాటిన పెన్షన్ దారులకు 10 శాతం అదనంగా పెన్షన్ చెల్లించాలని నిర్ణయం తీసుకొన్నారు.

కానిస్టేబుళ్లకు ప్రమోషన్లను పెంచాలని నిర్ణయం తీసుకొన్నారు. మరో వైపు డ్వాక్రా సంఘాల సభ్యులకు పసుపు కుంకుమ పథకం కింద ఒక్కొక్కరికి రూ. 10వేల చెల్లింపు విషయాన్ని కూడ బడ్జెట్‌లో పొందుపర్చారు. 

సంబంధిత వార్తలు

ఏపీ బడ్జెట్ 2019: కాపులకు పెద్దపీట, రూ.1000 కోట్లు

ఏపీ బడ్జెట్ 2019: బీసీలు టార్గెట్, అన్ని కులాలకు కార్పోరేషన్లు

ఏపీ బడ్జెట్ 2019: రైతులకు అన్నదాత సుఖీభవ

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019: ముఖ్యాంశాలు

click me!