ప్రముఖుల వ్యాఖ్యలు, కొటేషన్లు, విపక్షంపై విసుర్లు: బుగ్గన బడ్జెట్ ప్రసంగం

By narsimha lode  |  First Published Feb 7, 2024, 12:31 PM IST

కవితలు, ప్రముఖుల వ్యాఖ్యలను ఆర్ధిక మంత్రులు ప్రస్తావిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  ప్రముఖుల వ్యాఖ్యలను  తన ప్రసంగంలో ప్రస్తావిస్తుంటారు.


  అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో  2024-25 మధ్యంతర బడ్జెట్ ను రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  బుధవారం నాడు ప్రవేశ పెట్టారు.ప్రముఖుల కొటేషన్లను తన ప్రసంగంలో  ఆర్ధిక శాఖ మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తావించారు. మహాత్మాగాంధీ కొటేషన్లతో  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  తన బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి గల ఉత్తమ మార్గం, ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడం అని మహాత్మాగాంధీ కొటేషన్ ను ఆయన ప్రస్తావించారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ కొటేషన్లను కూడ ఆయన గుర్తు చేసుకున్నారు.  ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు అని  లింకన్  వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.రెండువేల సంవత్సరాల క్రితం  కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని రచించాడు. కౌటిల్యుడు చెప్పిన సూత్రాలను  తమ ప్రభుత్వం ప్రతిబింబిస్తుందని  ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  ప్రస్తావించారు. 

Latest Videos

undefined

also read:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024: జగన్ కేబినెట్ ఆమోదం

ప్రముఖ ఆర్ధిక వేత్త  జె.యమ్, కీన్స్ మాటలలో  ప్రభుత్వానికి ముఖ్యమైన బాధ్యత ఏమిటంటే ఇతరులు ఇప్పటికే చేస్తున్న పనులు చెయ్యడం లేదా  అవే పనులు కొంచెం మెరుగ్గా అధ్వాన్నంగా చేయడం కాదు, కానీ, ఇప్పటివరకు  అసలు ఎవరూ చేయని పనులు చేయడమని మంత్రి గుర్తు చేశారు.

ఐక్యరాజ్యసమితి మాజీ అధ్యక్షులు కోఫీ అన్నన్ మాటలలో  జ్ఞానం అనేది శక్తి. సమాచారం అనేది స్వేచ్ఛ. విద్య అనేది ప్రతి సమాజంలో ప్రతి కుటుంబంలో పురోగతికి పునాదిగా ఆయన పేర్కొన్న మాటలను గుర్తు చేశారు.

ఉన్నత విద్య విషయమై ప్రముఖ ఆర్ధిక వేత్త అమర్త్యసేన్ మాటలను మంత్రి ప్రస్తావించారు.  విద్య మనల్ని మనుషులుగా చేస్తుంది. మన ఆర్ధిక అభివృద్దిని, సామాజిక సమానత్వాన్ని, లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది.  మన జీవితాలను అన్ని రకాలుగా మార్చే సామర్థ్యం విద్య, భద్రతలకు ఉన్నాయన్నారు.

also read:ఆంధ్రప్రదేశ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024: రూ.2,86,389 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టిన బుగ్గన

పురాతన రోమెన్ సామెతను  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  ఆరోగ్య సంరక్షణ విషయమై ప్రస్తావించారు. ప్రజల ఆరోగ్యమే అత్యున్నత చట్టంగా పేర్కొన్నారు.నైపుణ్యం అనేది ఏకీకృత శక్తితో కూడిన అనుభవం, బుద్ది, ఆసక్తిల సమ్మేళనం అని  19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఆంగ్ల రచయిత, తత్వవేత్త జాన్ రస్కిన్ వ్యాఖ్యలను మంత్రి కోట్ చేశారు.మహిళా సాధికారిత-నారీ శక్తి విషయమై  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వ్యాఖ్యలను ప్రస్తావించారు.  ఒక సమాజం యొక్క పురోగతిని  ఆ సమాజం యొక్క మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తానన్నారు.

మీరు మొక్కజొన్న చేనుకు వేల మైళ్ల దూరంలో  ఉండి మీ చేతిలో ఉన్న పెన్సిల్ ను నాగలిగా భావిస్తే వ్యవసాయం చాలా సులభంగా కన్పిస్తుందని  డి.డి. ఐజన్ హోవర్ వ్యాఖ్యలను ప్రస్తావించారు.

మన పురోగతికి పరీక్ష, ఉన్న వాళ్ల సంపదను మరింత పెంచామా అని కాదు, లేని వాళ్లకి తగినంత అందించామా అని ఫ్రాంక్లిన్ డి. రూజ్ వెల్ట్ వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన  తన ప్రసంగంలో పేర్కొన్నారు.  ఒక దేశం యొక్క గొప్పదం దాని  పరిమాణంతో మాత్రమే కాదు.. ఆ దేశ ప్రజల సంకల్పం, ఐక్యత, సత్తువ, క్రమశిక్షణ, పటిష్టమైన నాయకత్వం ఆ దేశాన్ని చరిత్రలో గౌరవనీయ స్థానంలో నిలుపుతుందని సింగపూర్ జాతిపితగా  ప్రసిద్దిగాంచిన లీక్వాన్ యూ వ్యాఖ్యలను తన ప్రసంగంలో  మంత్రి ప్రస్తావించారు.

మహిళా సాధికారితకు క్రీడలు అత్యున్నత మాధ్యమం, ఎందుకంటే ఇవి మిమ్మల్ని మానసికంగా , శారీరంగా ధృడంగా చేస్తాయి. అది సవాళ్లను ఎదుర్కొన్ని లక్ష్యాన్ని చేధించే సామర్థ్యాన్ని ఇస్తుందని దివ్యాంగ ఒలింపిక్ క్రీడాకారిణి దీపామాలిక్ వ్యాఖ్యలను మంత్రి కోట్ చేశారు.
 

click me!