ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను జగన్ సర్కార్ ప్రవేశ పెట్టింది. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం నాడు ప్రవేశ పెట్టారు. రూ.2,86,389 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టారు మంత్రి.రెవిన్యూ వ్యయం రూ. 2,30,110 కోట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. పెట్టుబడి వ్యయం రూ. 30, 530 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
also read:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళన: తొమ్మిది మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్
undefined
రాష్ట్ర ప్రభుత్వ మూల ధన వ్యయం 30,558 .18 కోట్లు, రెవిన్యూలోటు రూ.24,758 .22 కోట్లు, ద్రవ్యలోటు రూ.55,817.50 కోట్లు, జీఎస్‌డీపీ ద్రవ్యలోటు 3.51 శాతంగా నమోదైంది. రెవిన్యూల్ లోటు 1.56 శాతం ఉందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు.
also read:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024: జగన్ కేబినెట్ ఆమోదం
ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం తనకు దక్కిందన్నారు.మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంగా సీఎం జగన్ భావించారని ఆయన గుర్తు చేశారు. తమ ప్రభుత్వం గడప గడపకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 55 రెవిన్యూ డివిజన్లను 78కి పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.2.6 లక్షల మంది వాలంటీర్లను నియమించిన విషయాన్ని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తావించారు. 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచినట్టుగా మంత్రి గుర్తు చేశారు.ఏడు అంశాల ఆధారంగా బడ్జెట్ ను రూపొందించినట్టుగా మంత్రి చెప్పారు. ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టుగా ఆయన తెలిపారు.
మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి గల ఉత్తమ మార్గం ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడమే అని మహాత్మాగాంధీ మాటలను స్మరిస్తూ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశ పెట్టారు.
రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందించామన్నారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తితో సమాజంలో అత్యంత బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.