బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వలస కూలి తారు ఉన్న డ్రమ్ములో ఇరుక్కుపోయాడు. (A labourer trapped in a tar drum) బయటకు రాలేక మూడు రోజుల పాటు నరకం అనుభవించాడు. చివరికి రెస్క్యూ టీమ్ సాయంతో పోలీసులు అతడిని బయటకు తీసుకొచ్చారు. (Man trapped in tar drum in Andhra Pradesh's NTR district) ఈ ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది.
ఆయనో కూలి. బీహార్ నుంచి ఏపీకి వలస వచ్చాడు. ఎన్టీఆర్ జిల్లాలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అనుకోకుండా ఓ చిక్కుల్లో పడ్డాడు. తారు ఉన్న ఓ డ్రమ్ములో కూరుకుపోయాడు. మూడు రోజుల పాటు నరకం అనుభవించాడు. తరువాత ఏం జరిగిందంటే ?
మంచి పనులు చేసే వ్యక్తికి గౌరవం దక్కదు - నితిన్ గడ్కరీ
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన జరిగింది. బీహార్‌కు చెందిన ఓ కూలి బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చి జీవిస్తున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. రోడ్డు పక్కన స్థానికులు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ తారు డ్రమ్ము కనిపించింది.
మూడు రోజులుగా తారు డబ్బాలో ఇరుక్కుపోయిన కూలి
ఎన్టీఆర్ జిల్లా - బిహార్‌కు చెందిన ఓ వలస కూలి తారు డబ్బాలో ఇరుక్కుపోయాడు. సగం శరీరం మొత్తం తారులో బిగుసుకుపోయింది. మూడు రోజుల తర్వాత గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
వారు రెస్క్యూ టీంతో కలిసి డబ్బాను కట్ చేసి… pic.twitter.com/T6jGj1j2we
అనుకోకుండా ఆ తారు డ్రమ్మును చూసిన స్థానికులు షాక్ అయ్యారు. అందులో వలస కూలి ఇరుక్కుపోయాడు. బయటకు రాలేక మూడు రోజుల నుంచి అవస్థలు పడుతున్నాడని గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశారు. అక్కడి చేరుకున్న పోలీసులు వెంటనే రెస్క్యూ టీమ్ ను పిలిపించారు.
బీజేపీ పడక గదుల్లోకి కూడా వచ్చేసింది - ఉత్తరాఖండ్ యూసీసీపై ప్రతిపక్షాల కామెంట్స్..
రెస్క్యూ టీమ్ తో కలిసి పోలీసులు ఆ డ్రమ్మును నిలువుగా కట్ చేశారు. కానీ డ్రమ్ము లోపల అతడి శరీరంలోని సగ భాగం ఇరుక్కుపోయింది. గంటల పాటు అతడిని బయటకు తీయడానికి రెస్క్యూ టీమ్ ప్రయత్నించింది. చివరికి సురక్షితంగా బయటకు తీశారు. మూడు రోజుల పాటు నరకం అనుభవించిన ఆ కూలిని పోలీసులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అతడు డ్రమ్ము లోపలికి ఎందుకు వెళ్లాడు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.