YS Jaganmohan Reddy : ఆడబిడ్డల పేరెంట్స్ కు జగన్ సర్కార్ గుడ్ న్యూస్... ఖాతాల్లో డబ్బులు జమ

By Arun Kumar P  |  First Published Nov 23, 2023, 2:28 PM IST

గత త్రైమాసికంలో 10,511 జంటల పెళ్లిళ్లవగా ఆ వధువుల తల్లుల ఖాతాలో కల్యాణమస్తు, షాదీ ముబారక్ కింద రూ.81.64 కోట్లు జమచేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 


అమరావతి : ఆడబిడ్డల పెళ్లి నిరుపేద, మద్యతరగతి కుటుంబాలకు భారం కాకూడదని జగన్ సర్కార్ వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాన్ని అమలుచేస్తోంది. అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఆర్థిక కష్టాలు పడకుండా వుండేందుకు వారికి ఆర్థికసాయం చేస్తోంది ప్రభుత్వం. ఇలా ఇటీవల (జూలై, ఆగస్ట్,సెప్టెంబర్ నెలల్లో) పెళ్లిచేసుకున్న అమ్మాయిల తల్లుల ఖాతాలో ఈ పథకం కింద డబ్బులు జమచేస్తూ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇలా మొత్తం రూ.81 కోట్లకు పైగా నిధులను విడుదల చేసి ఆ తల్లిదండ్రుల కళ్లలో ఆనందం నింపారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, దివ్యాంగులు, భవననిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా వుంటుందన్నారు. ఇలా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల పెళ్ళిళ్లకు ఆర్థిక సాయం చేయడం చాలా ఆనందంగా వుందన్నారు. 

Latest Videos

గత త్రైమాసికంలో 10,511 జంటలకు కల్యాణమస్తు, షాదీ ముబారక్ కింద రూ.81.64 కోట్లు అందజేసామని సీఎం జగన్ తెలిపారు. తద్వారా ఇప్పటివరకు మూడు విడతల్లో ఆర్థిక సాయం అందజేత పూర్తయ్యిందని అన్నారు. ఇలా ఇప్పటివరకు మూడు త్రైమాసికాల్లో మొత్తం  46,062 జంటల పెళ్లిళ్లకు రూ.349 కోట్లు అందించామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. 

Read More  గజదొంగే దొంగా.. దొంగా... అని అరిచినట్లు... జగన్ సర్కార్ పై అవినీతి ఆరోపణలు..: టిడిపికి బుగ్గన కౌంటర్

గత టిడిపి ప్రభుత్వంలో పరిస్థితిని ఇప్పటితో పోల్చుకుంటే ఆశ్యర్యం కలుగుతోందని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు హయాంలో ఏనాడూ నిజాయితీ, చిత్తశుద్దితో పథకాల అమలు జరగలేదని అన్నారు. కొంత కాలం ఏదో మొక్కుబడిగా ఆర్థిక సాయం చేసి 2018 లో పూర్తిగా ఈ పథకాన్నే పక్కనపెట్టారని అన్నారు. కానీ వైసిపి ప్రభుత్వం అలా కాదు... ప్రతి మూడునెలలకు ఓసారి కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదల చేస్తున్నామని అన్నారు.

ఆడబిడ్డల పెళ్లిళ్లకు సహాయపడుతూ ఆ తల్లిదండ్రులకు ఆర్థికసాయం చేయడం చాలా ఆనందంగా వుంటుందన్నారు. మంచి సంకల్పంతో కూడిన ఇలాంటి పథకాలెన్నో వైసిపి పాలనలో ప్రజలకు అందుతున్నాయన్నారు. ఓట్ల కోసమే ఇదంతా చేయడంలేదు... ప్రజలకు ఏదో చేయాలన్న తప్పనే ఇలాంటి పథకాల రూపకల్పనకు కారణమన్నారు. లీడర్లుగా ఉన్నప్పుడు సంకల్పం, విజన్ చాలా ముఖ్యమని సీఎం జగన్ అన్నారు. 

కల్యాణమస్తు, షాది ముబారక్ పథకాలను అమ్మాయిల రక్షణకు కూడా ఉపయోగపడుతున్నాయని సీఎం తెలిపారు. 10వ తరగతి సర్టిఫికేట్ వుండి 18 ఏళ్లు నిండిన అమ్మాయిలకే ఈ పథకం అందిస్తున్నామని... దీంతో అమ్మాయిలను చదవించేందుకు, పెళ్లీడు వచ్చిన తర్వాతే వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. ఈ పథకాల అమలు తర్వాత బాల్య వివాహాలు చాలా తగ్గాయని అన్నారు. గత టిడిపి ప్రభుత్వం ఇలాంటి ఆలోచనేమీ చేయలేదు... అసలు ఇలాంటి పథకాల అమలుపై ఆసక్తే చూపించలేదని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. 
 

click me!