AP Early Polls: ఏపీలో ముందస్తు ఎన్నికలు ?.. మోదీ, షాలకు చెప్పిన జగన్ !

Published : Jul 06, 2023, 12:07 AM ISTUpdated : Jul 06, 2023, 12:11 AM IST
AP Early Polls: ఏపీలో ముందస్తు ఎన్నికలు ?.. మోదీ, షాలకు చెప్పిన జగన్ !

సారాంశం

AP Early Polls: ఏపీ సీఎం వైఎస్ జగన్‌(YS Jagan) ముందస్తు ఎన్నికలకు (early elections) వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

AP Early Polls: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ముందస్తు ఎన్నికలు వెళ్లనున్నారా? తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్నికలు నిర్వహించాలని అధికార వైసీపీ భావిస్తోందా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వినిపిస్తోంది. బుధవారం నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలతో వరుసగా భేటీ అయిన సీఎం జగన్(YS Jagan) ఈ విషయాన్ని ప్రధానంగా చర్చినట్టు, తాను కూడా అసెంబ్లీని రద్దు చేసి,  లోక్ సభ ఎన్నికలకు ముందుగానే ఎన్నికలకు వెళ్లనని సీఎం జగన్ తెలిపినట్టు సమాచారం.  ఏపీలో ముందస్తుకు వెళ్తేనే..  రాజకీయంగా తనకు మేలు జరుగుతుందనే అధికార వైసీపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో కేంద్రం నుంచి సహకారం తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు.. కొత్తేమి కాదు .. గత ఏడాది కాలంగా ఈ ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ అంశం తెర మీదికి వచ్చినప్పుడల్లా.. వైసీపీ మంత్రులు తోసిపుచ్చుతూ వచ్చారు. కానీ,  ప్రతిపక్ష తెలుగు దేశం మాత్రం..సీఎం జగన్ కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు(Early Polls) వెళతారనే భావనలో ఉన్నారని చెప్పుకొచ్చింది. ఆ పార్టీ కూడా అందుకు తగ్గట్టుగానే ఎన్నికలు ఎదుర్కొనేందుకు తమ వ్యూహాలతో సిద్ధమవుతూ వస్తునే ఉంది. ఈ క్రమంలో నిర్వహించిన మహానాడులో ఎన్నికల హామీలు కూడా ఇచ్చింది. ఈ ఏడాది దసరా నాటికి పూర్తిస్థాయి ఎన్నికల మేనిఫెస్టోను కూడా సిద్ధం చేయాలని  టీడీపీ కూడా నిర్ణయించుకుంది. 
 
ఇదిలాఉంటే.. ఈ సంవత్సరం చివరి నాటికి మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక లోక్‌సభ ఎన్నికల అనంతరం హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీలో ఎన్నికలు జరుగుతాయి.

కానీ.. లోక్‌సభతోపాటు మొత్తం 14 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించాలని అధికార పార్టీ కీలక నేతలు యోచిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. గడువు ప్రకారం ఏప్రిల్,మే లో జరగాల్సిన ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలను ముందుగా జరపాలని, అంటే.. జనవరి నుంచి మార్చి చివరికి మధ్యలో లోక్‌సభ, 14 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే తరుణంలో.. ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో నవంబరు, డిసెంబర్‌లో జరిగే ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలతో పాటు నిర్వహించేలా.. ఈ మేరకు అవసరమైన న్యాయ సాంకేతిక కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

\లోక్‌సభ ఎన్నికలను కూడా ముందస్తు జరిగేలా రాజ్యాంగపరంగా ఉన్న అవరోధాలను అధిగమించేందుకు కేంద్రంలో కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన రాజ్యాంగ నిబంధనలు ప్రజాప్రాతినిధ్య చట్టం సవరణకు సంబంధించిన అంశాలను పార్లమెంట్‌లో తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జగన్ కూడా ముందస్తుకు వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. ఏపీలో అధికార పార్టీకి పెరుగుతున్న ప్రజావ్యతిరేకత, టీడీపీకి పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో సీఎం జగన్ ముందస్తుకు వెళ్లాలనుకుంటున్నట్లు సమాచారం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం