
సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారా? ముందువెనుక ఆలోచించకుండా షేర్ చేస్తున్నారా..? అయితే.. ఇక నుండి జాగ్రత్తగా ఉండాలంటోంది ఏపీ సీఐడీ. తప్పుడు పోస్టింగ్ లు పెట్టే వారికి కఠిన శిక్షలు తప్పవని, తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేసింది ఏపీ సీఐడీ.
ఇటీవల ఏపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ తాజాగా ఈ విషయంపై మరో సారి ఏపీ సీఐడీ స్పందించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ, అసత్య ప్రచారాలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించింది.
Read Also: సోషల్ మీడియాలో పరిచయం.. ఆ యువకుడిని నమ్మి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లింది. కానీ..
సోషల్ మీడియాలో ఇష్టానుసారం తప్పుడు వార్తల్ని వైరల్ చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో.. పోటీలు మార్ఫింగ్ చేసినా, దుష్ప్రచారం చేసేవారికి డబ్బులు ఇచ్చి ప్రోత్సహించినా శిక్ష తప్పదని పేర్కొంది.
డబ్బు కోసం .. ప్రభుత్వాన్ని, మహిళలను, గౌరవ పదవుల్లో ఉన్నవారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే.. కఠిన చర్యలు ఉంటాయని, శిక్ష తప్పదని , అలా చేసే వారిపై కూడా కఠిన చర్యలు కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఐడీ వెల్లడించింది. సోషల్ మీడియాలో పోస్టులను గానీ, ఇతర వీడియోలను గానీ షేర్ చేసే ముందు అది నిజమో కాదో నిర్ధారణ చేసుకోవాలని సీఐడీ సూచించింది. ఘర్షణలు రేకెత్తించే పోస్టులకు దూరంగా ఉండాలని సూచించింది.
Read Also: వీధి కుక్కలకు తిండి పెట్టినందుకు.. ఆ మహిళకు రూ. 8 లక్షల ఫైన్..!
తాజాగా .. టీడీపీ అనుబంధ టీఎన్ఎస్ఎఫ్ సోషల్ మీడియా సమన్వయకర్త సంతోష్ ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుంది. సీఎం జగన్ మాట్లాడిన ఓ వీడియోను అతడు మార్ఫింగ్ చేశారనీ, సీఎం ప్రసంగాన్ని అభ్యంతరకర రీతిలో మార్చేశారని ఆరోపణలున్నాయని సీఐడీ తెలిపింది.
ప్రభుత్వం, ప్రభుత్వ ప్రతినిధులను కించపరిచేలా, వారికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే ఐపీసీ సెక్షన్-124ఏ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయవచ్చు. ఆ తప్పిదం నిరూపితమైతే.. మూడేళ్లు నుంచి జీవిత ఖైదు, జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
Read Also: ఇక పుట్టిన వెంటనే ఆధార్.. హాస్పిటల్ లోనే ఇచ్చేందుకు UIDAI కసరత్తు..
అలాగే.. ఆధారాలు లేకుండా ఆసత్య, అబద్దాలను పోస్ట్ చేసిన కఠిన శిక్షలు తప్పవు. వ్యక్తులు, పార్టీలు, మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషల మధ్య చిచ్చు పెట్టడం. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం. ఇతరులను కించపర్చేలా పోస్టులు, ఫోటోలు పెడితే ఐపీసీ సెక్షన్ 505 కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తారు. ఈ నేరం నిరుపితమైతే.. మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.