విశాఖపట్టణం శారదా పీఠం: రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొన్న జగన్

By narsimha lode  |  First Published Feb 21, 2024, 2:44 PM IST


విశాఖపట్టణంలోని శారదా పీఠం వార్షికోత్సవంలో  ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.


విశాఖపట్టణం: విశాఖపట్టణం నగరంలోని శారదా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు పాల్గొన్నారు.  ఇవాళ  తాడేపల్లి నుండి విశాఖపట్టణం చేరుకున్న  ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  నేరుగా శారదా పీఠం చేరుకున్నారు.

also read:మరోసారి భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ: క్లారిటీ ఇచ్చిన జనసేనాని

Latest Videos

undefined

శారదా పీఠం వార్షికోత్సవంలో  సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. శారదా పీఠంలో  నిర్వహించిన రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.శారదా పీఠంలోని శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని సీఎం జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు.

also read:రాజమండ్రి రూరల్ అసెంబ్లీలో జనసేనే పోటీ: ట్విస్టిచ్చిన గోరంట్ల

గతంలో  కూడ శారదా పీఠాన్ని  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  సందర్శించారు.  గతంలో ఇక్కడ రాజశ్యామల అమ్మవారి పూజలో కూడ  సీఎం పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో  శారదా పీఠంలో జరిగిన పూజల్లో  సీఎం జగన్ పాల్గొన్నారు.  తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడ ఇటీవలనే తన నివాసంలో రాజశ్యామల యాగం నిర్వహించారు.

 

విశాఖ శారదా పీఠంలో వార్షికోత్సవ వేడుకలు.

సీఎం ‌ గారికి సాదర స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు. pic.twitter.com/MSrkONWAs8

— YSR Congress Party (@YSRCParty)

తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడ గతంలో  రాజశ్యామల యాగం నిర్వహించారు.  2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడ  కేసీఆర్  రాజశ్యామల యాగం నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇవాశ విశాఖపట్టణంలోని శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా  రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

click me!