రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ: అస్త్రశస్త్రాలు రెడీ చేసుకున్న అధికార, ప్రతిపక్షాలు

By Siva KodatiFirst Published Dec 8, 2019, 8:59 PM IST
Highlights

సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో అధికారపక్షాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.

సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో అధికారపక్షాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.

సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం బీఏసీ భేటీ కానుంది. సుమారు 20 అంశాలపై చర్చకు పట్టుబట్టాలని టీడీపీ భావిస్తుండగా.. ఏ అంశం మీదైనా చర్చకు సిద్ధమని అధికారపక్షం సవాల్ విసురుతోంది.

Also read:బిజెపికి షాక్... వైసిపిలోకి గోకరాజు, ముహూర్తం ఖరారు

ముఖ్యంగా స్పీకర్ తమ్మినేని, మంత్రులు కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్ కామెంట్ల అంశాన్ని సభలో ప్రస్తావించేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. దీనికి ప్రతిగా అచ్చెన్నాయుడు, కూన రవిలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను వైసీపీ సిద్దంగా ఉంచుకున్నట్లుగా తెలుస్తోంది.

అలాగే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అనర్హత పిటిషన్ ఇచ్చే అంశాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రతిపక్షహోదా పోయేలా చేయాలని ముఖ్యమంత్రి జగన్ పావులు కదుపుతున్నారు.

Also read:చంద్రబాబుతో భేటీ: బుక్కైన ఆనం, జగన్ సీరియస్

మరోవైపు ఈ శీతాకాల సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వం కొన్ని కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఎలక్ట్రిసిటీ రెగ్యులెటరీ కమిషన్ తరహాలో ఆర్టీసీ ఛార్జీల విషయంలోనూ రెగ్యులటరీ కమిషన్ ఏర్పాటు చేస్తూ బిల్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే మద్యం విక్రయాల్లో అక్రమాలు, అక్రమ నిల్వలను అడ్డుకునేందుకు ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తోంది. 

click me!