బిజెపికి షాక్... వైసిపిలోకి గోకరాజు, ముహూర్తం ఖరారు

By Arun Kumar PFirst Published Dec 8, 2019, 8:48 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే బాగా దెబ్బతిన్న బిజెపికి మరో భారీ షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పార్టీని ఎన్నోఏళ్లుగా అంటిపెట్టుకుని వున్న మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు వైసిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో బలోపేతం కోసం ప్రయత్నిస్తున్న బిజెపికి పెద్ద ఝలక్ తగిలింది. ఎన్నోఏళ్లుగా బిజెపి పార్టీనే అంటిపెట్టుకుని వున్న మాజీ ఎంపి  గోకరాజు గంగరాజు వైసిపి తీర్ధం పుచ్చుకోడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారయ్యింది. 

గోకరాజు రేపు అంటే  సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు  వైసీపీ కండువా కప్పుకోనున్నాడని తెలుస్తోంది. ఆయన ఒక్కడే కాదు కుటుంబం  మొత్తం వైసిపి కండువా కప్పుకోనున్నారట. కొడుకు రామరాజు, తమ్ముడు నరసింహరాజుతో కలిసి వైసిపిలో చేరడానికి  గంగరాజు రంగంసిద్దం చేసుకున్నట్లు సమాచారం. 

read more ఎన్నికల సమయంలో కాదు ఆ పని ఇప్పుడు చేయాలి: జగన్ కు పవన్ చురకలు

గోకరాజు కుటుంబాన్ని స్వయంగా వైసిపి అధినేత జగన్ పార్టీలో చేర్చుకోనున్నట్లు తెలుస్తోంది. రేపు మద్యాహ్నం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఈ చేరిక కార్యక్రమం వుండనుంది. 

గోకరాజు గంగరాజు 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే మారిన రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని 2019 ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో నర్సాపురం నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు విజయం సాధించారు.

read more అలా చేస్తే చంపేస్తా...: ప్రియాంకను బెదిరించిన నిందితుడు

అయితే రఘురామకృష్ణంరాజు వైసిపిని వీడి బిజెపిలో చేరనున్నట్లు గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన ఇప్పటికే బిజెపి పెద్దలతో మంతనాలు కూడా జరిపినట్లు... రేపో మాపో కాషాయ పార్టీలో చేరడం ఖాయమేనంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో గోకరాజు వైసిపిలో చేరనుండటం బలోపేతమవ్వాలని చూస్తున్న బిజెపికి పెద్ద షాకే అని చెప్పాలి. 

click me!