స్టీల్ ప్లాంట్ రగడ: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం

By Siva KodatiFirst Published May 20, 2021, 4:01 PM IST
Highlights

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. ఈ మేరకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 
 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. ఈ మేరకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. జగన్ ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ రాశారని గౌతమ్ రెడ్డి సభకు తెలిపారు.

ప్రైవేటీకరణ కాకుండా సీఎం తన లేఖలో ఐదు ప్రత్యామ్నాయాలను సూచించారని గుర్తుచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టిన్ మైన్స్ కేటాయించాలని గౌతమ్ రెడ్డి డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ నష్టాల నుంచి బయటపడేందుకు అన్ని అవకాశాలున్నాయని... విశాఖ ఉక్కు తెలుగువారి ఆత్మగౌరవంతో ముడిపడి వుందని గౌతమ్ రెడ్డి వెల్లడించారు. 
 

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. కార్మిక, విద్యార్ధి, రాజకీయ సంఘాలు నిరసనను తెలియజేస్తున్నాయి.

ప్రైవేటీకరణ ఆగదని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ తేల్చి చెప్పారు.వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమై అడిగిన ప్రశ్నకు  కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

Also Read:విశాఖ స్టీల్ ప్లాంట్‌ నష్టాలకు కారణలివే: నిర్మలా సీతారామన్

 స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కు తగ్గే ప్రశ్నే లేదని కేంద్రం స్పష్టం చేసింది.  ఈ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొన్న విషయాన్ని మంత్రి ఈ సమాధానంలో చెప్పారు. స్టీల్ ప్లాంట్ తో పాటు అనుబంధ పరిశ్రమలను కూడ ప్రైవేటీకరించనున్నట్టుగా ఆయన ప్రకటించారు.నవరత్న సంస్థగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ వాణిజ్య, ఆర్ధిక లావాదేవీలను చేస్తోందన్నారు.

గనులు కేటాయించాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్, ఒడిశాచ ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలను కోరినట్టుగా ఆ సమాధానంలో మంత్రి గుర్తు చేశారు. ఇదే విషయమై కేంద్ర ఉక్కు శాఖకు కూడ స్టీల్ ప్లాంట్ లేఖ రాసిందన్నారు.ప్రత్యేకంగా ఓ బ్లాక్ ను కేటాయించాలని కేంద్ర ఉక్కు శాఖ ఒడిశా ప్రభుత్వాన్ని కోరిందని మంత్రి తెలిపారు.

click me!